చర్లపల్లి ‘ఈఎ్‌సఐ’ని అప్‌గ్రేడ్ చేస్తాం
ABN , First Publish Date - 2020-12-10T06:28:01+05:30 IST
దాదాపు 13వేల మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సేవలందిస్తున్న చర్లపల్లి ఈఎ్‌సఐ ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేస్తామని ఈఎ్‌సఐ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ సాగర్ హామీనిచ్చారు.

చర్లపల్లి ‘ఈఎ్‌సఐ’ని అప్‌గ్రేడ్ చేస్తాం
ఈఎ్‌సఐ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ
కుషాయిగూడ, డిసెంబర్ 9(ఆంధ్రజ్యోతి): దాదాపు 13వేల మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సేవలందిస్తున్న చర్లపల్లి ఈఎ్‌సఐ ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేస్తామని ఈఎ్‌సఐ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ సాగర్ హామీనిచ్చారు. చర్లపల్లి ఇండస్ట్రీయలిస్ట్స్ అసోసియేషన్ (సీఐఏ) విజ్ఞప్తి మేరకు వారు బుధవారం ఈఎ్‌సఐ ఆస్పత్రిని సందర్శించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఒకే ఒక్కరి బదులుగా... మరో ఐదుగురు వైద్య బృందంతో సేవలందించేందుకు అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వారు వెల్లడించారు. అప్‌గ్రేడ్ అయ్యేంతవరకు ముందుగా మరో వైద్యుడు, సహాయక సిబ్బందిని కూడా నియమిస్తామని స్పష్టం చేశారు. చర్లపల్లి పారిశ్రామిక వాడతో పాటు కుషాయిగూడలోని వేలాది పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఈ ఆస్పత్రి సౌకర్యవంతంగా ఉంటుందని సీఐఏ అధ్యక్షుడు సీహెచ్.జలంధర్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కె.సుధీర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మిరుపాల గోపాలరావు, సీఐఏ ప్రతినిధులు పి.ఎ్‌స.మోహన్, సుధీర్‌రెడ్డి, శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.
ఫ రోడ్డు విస్తరణకు చర్యలు: మర్రి రాజశేఖర్ రెడ్డి
చర్లపల్లి నుంచి రాంపల్లి వెళ్లే రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకుంటానని టీఆర్‌ఎస్ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి హామీనిచ్చారు. రోడ్డు విస్తరణకు నిధులు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.