జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఇంటింటికీ మెడికల్‌ కిట్ల పంపిణీ

ABN , First Publish Date - 2020-07-15T12:33:39+05:30 IST

కరోనా వైరస్‌ సోకిన బాధితులకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మెడికల్‌ కిట్స్‌ అందజేశారు. కూకట్‌పల్లి జోన్‌ పరిధిలోని ఐదు సర్కిళ్ల పరిధిలో

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఇంటింటికీ మెడికల్‌ కిట్ల పంపిణీ

కూకట్‌పల్లి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ సోకిన బాధితులకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మెడికల్‌ కిట్స్‌ అందజేశారు. కూకట్‌పల్లి జోన్‌ పరిధిలోని ఐదు సర్కిళ్ల పరిధిలో హోమ్‌క్వారంటైన్‌లో ఉన్న వారి ఇంటింటికి వెళ్లి కిట్స్‌ అందజేసినట్లు జెడ్సీ వి.మమత తెలిపారు. కిట్స్‌లో మందులతోపాటు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు ఉన్నాయన్నారు. మూసాపేట, కూకట్‌పల్లి సర్కిళ్ల పరిధిలోని డివిజన్ల వారీగా సిబ్బందిని కేటాయించి కరోనా కిట్స్‌ అందజేశారు.


కరోనాను అడ్డుకోవడానికి ‘సేఫ్‌ మూవ్‌’ పేరుతో ప్రచారం

చిక్కడపల్లి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి హైదరాబాద్‌లో ‘సేఫ్‌ మూవ్‌’ పేరుతో విస్తృత ప్రచారం చేపట్టారు. బౌన్స్‌ సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయే్‌షరంజన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా బౌన్స్‌ సంస్థ సీవోవో అనిల్‌ జి మాట్లాడుతూ... బౌన్స్‌ స్కూటర్లను యాంటీమైక్రోబాల్‌ సొల్యూషన్‌ ద్వారా శుభ్రం చేస్తున్నామని తెలిపారు. జెర్మీ ఫీల్డ్‌ విధానం అనే పేరున్న ఈ ప్రక్రియ ద్వారా వాహనం పై భాగాలు శానిటైజ్‌ కావడమే కాకుండా సార్స్‌ సహా అనేక ప్రాణాంతకమైన సూక్ష్మ క్రిములను 99 శాతం నిర్మూలిస్తుందన్నారు. 

Updated Date - 2020-07-15T12:33:39+05:30 IST