గర్భిణి కడుపులో కేన్సర్‌ కణితి

ABN , First Publish Date - 2020-12-29T06:55:08+05:30 IST

గర్భిణి పొత్తి కడుపు దిగువ భాగంలో ఏర్పడిన కేన్సర్‌ కణితిని కేర్‌ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు.

గర్భిణి కడుపులో కేన్సర్‌ కణితి

ప్రసవం తర్వాత తొలగించిన కేర్‌ ఆస్పత్రి వైద్యులు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): గర్భిణి పొత్తి కడుపు దిగువ భాగంలో ఏర్పడిన కేన్సర్‌ కణితిని కేర్‌ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. ఆమెతోపాటు గర్భంలో ఉన్న 34 వారాల శిశువును కాపాడారు. బీదర్‌కు చెందిన 23 సంవత్సరాల మహిళ గర్భిణి. ఆమె పొత్తికడుపు దిగువ భాగంలో కణితి ఏర్పడగా కేర్‌ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేసి ఉదరాగ్ర గోడ ఎడమ వైపు దిగువ భాగంలో 15 నుంచి 20 సెంటీమీటర్ల కణితి ఉన్నట్లు గుర్తించారు. మహిళ గర్భవతి కావడంతో కణితి తొలగించాలా.. లేక ప్రసవం చేయాలా.. అనే అంశంపై వైద్యులు విపిన్‌ గోయల్‌, రవీచంద్ర, రజని, టీవీఎస్‌ గోపాల్‌ చర్చించారు. కేన్సర్‌ కణితి పెద్దగా ఉండడంతో ఆమెకు సిజేరియన్‌ ద్వారా ప్రసవం చేయడం కష్టమని భావించారు. తల్లి, శిశువు వైటల్స్‌ను గమనించి ఆమెకు సాధారణ ప్రసవం చేశామని డాక్టర్‌ విపిన్‌ తెలిపారు. ఈనెల 24న రెండు సెంటీమీటర్ల కోతతో కణితి తొలగించారు. కుడివైపు తొడపై భాగం నుంచి సేకరించిన చర్మంతో ఉదారాగ్ర భాగాన్ని పునర్మించినట్లు తెలిపారు. శస్త్రచికిత్స తరువాత ఆమె కోలుకోవడంతో ఆదివారం డిశ్చార్జి చేశామని వైద్యులు తెలిపారు. 





Updated Date - 2020-12-29T06:55:08+05:30 IST