జర్మనీ నుంచి వచ్చిన యువకుడి హోం క్వారంటైన్‌

ABN , First Publish Date - 2020-03-25T09:49:16+05:30 IST

ప్రగతినగర్‌ పీపుల్స్‌ ఆస్పత్రిలో లైన్‌లోని ఓ ప్లాట్‌లో ఉండే 24 ఏళ్ల యువకుడిని హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఇతను గత వారం జర్మనీ నుంచి నగరానికి...

జర్మనీ నుంచి వచ్చిన యువకుడి హోం క్వారంటైన్‌

ప్రగతినగర్‌, మార్చి24 (ఆంధ్రజ్యోతి): ప్రగతినగర్‌ పీపుల్స్‌  ఆస్పత్రిలో లైన్‌లోని ఓ ప్లాట్‌లో ఉండే 24 ఏళ్ల యువకుడిని హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఇతను గత వారం జర్మనీ నుంచి నగరానికి వచ్చాడు. వికారాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లిన యువకుడు అక్కడే రెండు రోజులు వైద్యుల సమక్షంలో ఉన్నాడు. నెగటివ్‌ రిపోర్టు రావడంతో నగరానికి వచ్చాడు. మంగళవారం విషయం తెలుసుకున్న మున్సిపల్‌ సిబ్బంది, స్ధానిక వైద్యులు వచ్చి అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రక్తనమూనాలను సేకరించి, ల్యాబ్‌కు పంపించారు. బుధవారం రిపోర్టులు వస్తాయని అధికారులు తెలిపారు. 

Read more