ప్రధాని ఫొటోలు షేర్‌ చేసిన వ్యక్తి అరెస్టు

ABN , First Publish Date - 2020-08-12T09:42:47+05:30 IST

మార్ఫింగ్‌ చేసిన ప్రధాని ఫొటోలు షేర్‌ చేసిన వ్యక్తిని నార్సింగ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలను కొందరు మార్ఫింగ్‌

ప్రధాని ఫొటోలు షేర్‌ చేసిన వ్యక్తి అరెస్టు

నార్సింగ్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): మార్ఫింగ్‌ చేసిన ప్రధాని ఫొటోలు షేర్‌ చేసిన వ్యక్తిని నార్సింగ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలను కొందరు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వాటిని నార్సింగ్‌కు చెందిన ఓ వ్యక్తి షేర్‌, లైక్‌, కామెంట్‌ కూడా చేశాడని, అతడిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతాపార్టీ దళితమోర్చా నార్సింగ్‌ మునిసిపాలిటీ అధ్యక్షుడు మద్దూరి అనిల్‌కుమార్‌ నార్సింగ్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మహ్మద్‌ గౌస్‌ పాషా అలియాస్‌ ఆటో పాషాను మంగళవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2020-08-12T09:42:47+05:30 IST