నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ లభ్యం

ABN , First Publish Date - 2020-12-17T11:58:28+05:30 IST

నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన మదీనాగూడకు

నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ లభ్యం

హైదరాబాద్/జహీరాబాద్‌ : నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన మదీనాగూడకు చెందిన ముళ్లపూడి సతీష్‌(35) ఆచూకీ బుధవారం జహీరాబాద్‌లో లభించింది. డీఎస్పీ శంకర్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్‌ తండ్రి సత్యనారాయణరాజు ఫిర్యాదు మేరకు అప్పట్లో కేపీహెచ్‌బీ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఇటీవల కొవిడ్‌-19లో భాగంగా పట్టణంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా సతీష్‌ ద్విచక్రవాహనం(ఏపీ10-ఏయూ 9252)పై తిరుగుతుండగా ఆయన వివరాలను తెలంగాణ పోలీస్‌ ఈ-చలాన్‌ రిపోర్టులో నమోదు చేశారు. పోలీస్‌ ఈ-చలాన్‌ ఆధారంగా జహీరాబాద్‌ పోలీసుల ద్వారా సతీష్‌ ఫోన్‌ నంబరును కేపీహెచ్‌బీ పోలీసులు తెలుసుకున్నారు. విషయాన్ని సతీష్‌ కుటుంబ సభ్యులకు తెలిపారు.  సతీష్‌ను జహీరాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌లో కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Updated Date - 2020-12-17T11:58:28+05:30 IST