రక్తపు దారులు

ABN , First Publish Date - 2020-03-04T07:48:49+05:30 IST

మల్లాపూర్‌ అశోక్‌నగర్‌కు చెందిన జడిగింటి సౌందర్య(35) పదేళ్లుగా జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌లో శానిటేషన్‌ విభాగంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగి(ఎ్‌సఎ్‌ఫఏ)గా పనిచేస్తోంది.

రక్తపు దారులు

వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం  

హెల్మెట్‌ పెట్టుకున్నా దక్కని ప్రాణం

ఏడుగురు విద్యార్థులుసహా పదిమందికి గాయాలు  

వీరిలో ఒకరు సోమాలియా దేశస్థుడు


వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. ఏడుగురు విద్యార్థులు, విదేశీయుడిసహా పదిమంది గాయపడ్డారు. ఈ ఘటనలు కుషాయిగూడ, జీడిమెట్ల, బంజారాహిల్స్‌ పోలీ్‌సస్టేషన్ల పరిధుల్లో జరిగాయి. మృతుల్లో ఒకరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగి. హెల్మెట్‌ పెట్టుకున్నా ఆమె ప్రాణాలు దక్కలేదు. 


ఏఎ్‌సరావునగర్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మల్లాపూర్‌ అశోక్‌నగర్‌కు చెందిన జడిగింటి సౌందర్య(35) పదేళ్లుగా జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌లో శానిటేషన్‌ విభాగంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగి(ఎ్‌సఎ్‌ఫఏ)గా పనిచేస్తోంది. మంగళవారం తెల్లవారు జామున ఈసీఐఎల్‌ చౌరస్తా, మహే్‌షనగర్‌లో పారిశుధ్య కార్మికుల హాజరును పరిశీలించి ద్విచక్రవాహనం(టీఎస్‌ 08 ఈఎక్స్‌ 4887)పై భవానీనగర్‌ కాలనీకి బయలుదేరింది. రాధికా చౌరస్తాలో దమ్మాయిగూడ వెళ్లే రోడ్డులో మూల మలుపు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన జీహెచ్‌ఎంసీ చెత్త లారీ(టీఎ్‌స-08యుఏ-5203)ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఆమె లారీ వెనుక చక్రాల కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. తలకు హెల్మెట్‌ పెట్టుకున్నా ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


విషయం తెలుసుకున్న ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డి, తూర్పు జోనల్‌ కమిషనర్‌ ఆర్‌. ఉపేందర్‌రెడ్డి, కార్పొరేటర్‌ వజ్జూరి పావనీరెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ శైలజ మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సౌందర్య కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. గత ఏడాది నవంబర్‌లో ఇదే చౌరస్తాలో లారీ ఢీకొని సరిత అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. సౌందర్యకు అరుణ్‌(18), స్టీఫెన్‌(15) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 

Updated Date - 2020-03-04T07:48:49+05:30 IST