మల్కాజిగిరి సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-06-16T09:57:07+05:30 IST

మల్కాజిగిరి సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేస్తూ రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మల్కాజిగిరి

మల్కాజిగిరి సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌

ఉత్తర్వులు జారీ చేసిన రాచకొండ సీపీ 


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరి సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేస్తూ రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మల్కాజిగిరి సీసీఎస్‌ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌ లావోడి బాలుచౌహాన్‌ మొదటి భార్య బతికుండగానే, మరో మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత విషయం తెలిసిన రెండో భార్య నిలదీయగా, ఆమెను శారీరకంగా మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ‘పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నానని, తేడా వస్తే అంతుచూస్తానని’ బెదిరించాడు. ఈ క్రమంలో బాధితురాలు గతేడాది సరూర్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై 507, 420, 498-ఏ, 504, 506, 323 సెక్షన్‌ల కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపించారు. ఆరోపణలు నిజమని తేలడంతో ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2020-06-16T09:57:07+05:30 IST