ప్రేమించి పెళ్లి చేసుకుని.. వదిలేశాడు..!

ABN , First Publish Date - 2020-07-18T10:03:18+05:30 IST

ప్రేమించానని చెప్పడంతో పెద్దలను ఎదిరించి అతడిని పెళ్లి చేసుకుంది. అంతకు ముందే పెళ్లైన విషయాన్ని దాచిపెట్టిన ఆ

ప్రేమించి పెళ్లి చేసుకుని.. వదిలేశాడు..!

పెళ్లైన విషయం దాచి మరో యువతి జీవితంతో ఆటలు పోలీసులను ఆశ్రయించిన బాలింత  


రాంగోపాల్‌పేట్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ప్రేమించానని చెప్పడంతో పెద్దలను ఎదిరించి అతడిని పెళ్లి చేసుకుంది. అంతకు ముందే పెళ్లైన విషయాన్ని దాచిపెట్టిన ఆ ప్రబుద్ధుడు వదిలేయడంతో న్యాయం చేయమని పది రోజుల పసికందుతో పోలీసులను ఆశ్రయించింది. గుంటూరుకు చెందిన ఎస్‌కే షబీనా (25) కొంతకాలం క్రితం చదువుకునేందుకు నగరానికొచ్చి ఈసీఐఎల్‌లో ఉండేది. ఆ మెకు ఓ స్నేహితురాలి ద్వారా అవుసలి సంపత్‌(29) పరిచ యమయ్యాడు. అతడికి అంతకుముందే వివాహమై ఓ కుమార్తె కూడా ఉంది. కానీ, ఈ విషయాన్ని దాచి పెట్టి షబీనాకు ప్రేమ పేరిట దగ్గరయ్యాడు. 2018 మార్చి 14న ఆమె పెద్దలను ఎదిరించి సంపత్‌ను పెళ్లాడింది. ఇద్దరూ ఆవులమంద ప్రాంతంలో కాపురం పెట్టారు. తరచూ రాత్రి డ్యూటీల పేరుతో వనస్థలిపురంలో ఉంటున్న మొదటి భార్య వద్దకు వెళ్లేవాడు. అయితే, అతడి లీలలు తెలుసుకున్న మొదటి భార్య, ఆమె సోదరుడు వచ్చి షబీనాతో గొడవ పడ్డారు. గొడవ పెద్దది కావడంతో సంపత్‌ నిండు గర్భిణి అయిన షబీనాను వదిలి మొదటి భార్యతో వెళ్లిపోయాడు.


అప్పటి నుంచి తిరిగి రాలేదు. ఫోన్‌ కూడా చేయలేదు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో ఆమె కన్నవారూ పట్టించుకోలేదు. భర్త వదిలేసి వెళ్లిన బాలానగర్‌లోని చిన్న గదిలోనే ఉండి పోయింది. ఈ క్రమంలోనే ఈ నెల 9న కోఠి మెటర్నరీ ఆస్పత్రిలో పండంటి బాబుకు జన్మనిచ్చింది. మోసం చేసి పెళ్లి చేసుకుని వదిలేసి వెళ్లిన సంప త్‌పై చర్యలు తీసుకోవాలని శుక్రవారం మహంకాళి ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2020-07-18T10:03:18+05:30 IST