పోలీ్‌సస్టేషన్‌కు ప్రేమజంట

ABN , First Publish Date - 2020-06-22T10:09:27+05:30 IST

ఇటీవల పోలీసుల సమక్షంలో ప్రేమవివా హం చేసుకున్న కూతురిపై ఓ తండ్రి దొంగతనం కేసు పెట్టడంతో పోలీసులు ఆదివారం ఆ

పోలీ్‌సస్టేషన్‌కు ప్రేమజంట

యువతిపై తండ్రి దొంగతనం కేసు


కార్వాన్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఇటీవల పోలీసుల సమక్షంలో ప్రేమవివా హం చేసుకున్న కూతురిపై ఓ తండ్రి దొంగతనం కేసు పెట్టడంతో పోలీసులు ఆదివారం ఆ జంటను పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించారు. ఓ ప్రేమజంట జూన్‌ 8న పోలీసులను ఆశ్రయించి, ప్రేమ వివాహం చేసుకుంది. అప్పట్లోనే యువతి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి మాట్లాడగా, ఆమె తన ఇష్ట ప్రకారమే వివాహం చేసుకుంటున్నట్లు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు వెళ్లిపోయారు.


అయితే, జూన్‌ 17న యువతి తండ్రి తన ఇంట్లో తొమ్మిది తులాల బంగారు నగలు, రూ. 4లక్షలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురిపైనే అనుమానం ఉందని  పేర్కొన్నాడు. దీంతో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బురాన్‌ దర్యాప్తులో భాగంగా నూతన దంపతులను పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించి, విచారించారు. తండ్రి ఫిర్యాదు మేరకే తాను వారిని పిలిచానని, విచారించిన తర్వాత పంపించినట్లు తెలిపారు. 

Updated Date - 2020-06-22T10:09:27+05:30 IST