మనుషుల మధ్య ప్రేమ తగ్గుతోంది : మంత్రి నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-03-02T09:40:50+05:30 IST

నేటి సమాజంలో మానవుల మధ్య ప్రేమ తగ్గుతోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

మనుషుల మధ్య ప్రేమ తగ్గుతోంది : మంత్రి నిరంజన్‌రెడ్డి

ఆబిడ్స్‌, మార్చి1 (ఆంధ్రజ్యోతి): నేటి సమాజంలో మానవుల మధ్య ప్రేమ తగ్గుతోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌ దేవులపల్లి రామానుజారావు ఆడిటోరియంలో పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో ‘మొగ్గల ప్రక్రియలో ప్రేమ వికాసం’ అంశంపై 12 మంది కవులు రాసిన ‘ప్రేమ మొగ్గలు’ కవితా సంపుటాల ఆవిష్కరణకు మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషుల మధ్య ప్రేమ కొరవడిన నేపథ్యంలో.. మొగ్గల ప్రక్రియలో ప్రేమ కవిత ్వం రాయడం విశేషమన్నారు. సభాధ్యక్షత వహించిన  తెలంగాణ సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఆవిర్భవించిన మొగ్గలు ప్రక్రియలో పన్నెండు మంది కవులు  ప్రేమమొగ్గలు రాయడం గొప్ప విషయమన్నారు.


విశిష్ఠ అతిథిగా విచ్చేసిన కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం సభ్యులు ఆచార్య ఎస్వీ రామారావుతో పాటు  తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సారస్వత పరిషత్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జె.చెన్నయ్య, పాలమూరు జిల్లా ప్రముఖ న్యాయవాది వి.మనోహర్‌రెడ్డి. ప్రముఖ కవి, అనువాదకులు జలజం సత్యనారాయణ, నేటి నిజం దినపత్రిక సాంపాదకులు బైస దేవదాసు, ప్రముఖ కవి కె.లక్ష్మణ్‌గౌడ్‌, కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య బన్న ఐలయ్య, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, ప్రముఖ న్యాయవాది బుర్రి వెంకట్రామారెడ్డి, పూర్వ జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ ఎస్‌.విజయ్‌కుమార్‌, ప్రముఖ కవి, కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, పాలమూరు సామిథీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ బోగ కోదండపాణి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమానికి డాక్టర్‌ గుంటి గోపీ సమీక్ష చేయగా ప్రసిద్ధ కవయిత్రి అయినంపూడి లక్ష్మి, మొగ్గల సృష్టికర్త డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-02T09:40:50+05:30 IST