దినాలకు వస్తూ అనంతలోకాలకు..

ABN , First Publish Date - 2020-07-05T10:03:18+05:30 IST

పార్శిగుట్టకు చెందిన కొడకండ్ల గిరి(48) కారు డ్రెవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. మూడుచింతలపల్లి మండలం ఆద్రా్‌సపల్లిలో తమ

దినాలకు వస్తూ అనంతలోకాలకు..

శామీర్‌పేట రూరల్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): పార్శిగుట్టకు చెందిన కొడకండ్ల గిరి(48) కారు డ్రెవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. మూడుచింతలపల్లి మండలం ఆద్రా్‌సపల్లిలో తమ బంధువుల ఇంట్లో దశదినకర్మకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. ఆద్రా్‌సపల్లి శివారులో ఉన్న మూలమలుపునకు రాగానే ఉద్దెమర్రి నుంచి ఇటుక లోడ్‌తో పొన్నాల్‌ వైపు వెళ్తున్న లారీ(ఏపీ11టీ8561) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గిరి తల భాగం నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-05T10:03:18+05:30 IST