దాతల కరుణ
ABN , First Publish Date - 2020-04-12T09:27:39+05:30 IST
అఫ్జల్‌గంజ్: స్వామి దయానంద్‌నగర్‌లో ఆదిత్యా శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నందకిషోర్ వ్యాస్(బిలాల్) ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్, సీనియర్ నాయకులు ఆర్.వి.మహేందర్ కుమార్, దుర్గం రాధాకృష్ణ, పి.నరేందర్ యాదవ్, జి.నరేందర్‌యాదవ్‌తో కలిసి శనివారం వెయ్యి నిరుపేద కుటుంబాలు, వలస కూలీలకు నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు.

పలు చోట్ల ఆహార పొట్లాలు, వంట సామగ్రి పంపిణీ
పేదలు, వలస కూలీలను ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థలు
సాయం చేసేందుకు ముందుకొస్తున్న దాతలు
లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న పేదలు, వలస కూలీలను ఆదుకునేందుకు దాతలు తోచిన సాయం చేస్తున్నారు. కొందరు నిత్యావసర సరుకులు అందజేస్తుంటే.. మరికొందరు ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఇంకొందరు నగదు రూపంలో సీఎం సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు. ఇలా శనివారం నగరంలో పలు చోట్ల స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్ల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు వివిధ రూపాల్లో పేదలకు ఆపన్నహస్తం అందించి మానవత్వం చాటుకున్నారు.
జోన్ బృందం, ఏప్రిల్11 (ఆంధ్రజ్యోతి): అఫ్జల్‌గంజ్: స్వామి దయానంద్‌నగర్‌లో ఆదిత్యా శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నందకిషోర్ వ్యాస్(బిలాల్) ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్, సీనియర్ నాయకులు ఆర్.వి.మహేందర్ కుమార్, దుర్గం రాధాకృష్ణ, పి.నరేందర్ యాదవ్, జి.నరేందర్‌యాదవ్‌తో కలిసి శనివారం వెయ్యి నిరుపేద కుటుంబాలు, వలస కూలీలకు నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే ఆ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులు అందజేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.
గోల్నాక: గోల్నాక డివిజన్ గంగానగర్‌లోని బంగారు మైస్మమ్మ దేవాలయం ప్రాంగణంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఆర్.కె.బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ కాలేరు పద్మ పారిశుధ్య కార్మికులకు అన్నదానం నిర్వహించారు.
తార్నాక: ‘లాక్‌డౌన్ కష్టాలా.. మా దృష్టికి తీసుకురండి’ అంటూ ఆంధ్రజ్యోతి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం లాలాపేట్‌లో నివాసం ఉంటున్న ఆనంద్ అనే కార్మికుడికి లబ్ధి చేకూరింది. నిత్యావసర వస్తువులు లేక ఆకలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఆంధ్రజ్యోతి కార్యాలయానికి ఫోన్ చేసి తన కష్టాలను పంచుకున్నాడు. వెంటనే స్పందించిన ఆంధ్రజ్యోతి స్థానిక ప్రతినిధి అతడికి నిత్యావసర వస్తువులు అందేలా చొరవ తీసుకున్నాడు. దీంతో ఆ కార్మికుడు ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలిపాడు. లాలాపేట్‌లోని శ్రీ లక్ష్మీగణపతి సాయి అయ్యప్ప దేవస్థానంలో పూజారిగా పని చేస్తున్న దివాకర్ల సత్యనారాయణమూర్తి పేదలకు శనివారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
రాజేంద్రనగర్: లాక్‌డౌన్ సమయంలో అత్తాపూర్ డివిజన్‌లో 20 రోజులుగా ఇంటింటి సర్వే చేస్తున్న ఆశా వర్కర్లకు డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి శనివారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
చార్మినార్/పహడీషరీప్: బీజేపీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో దారుషిఫా వద్ద షిమా ముస్లింలకు ఆ పార్టీ నగర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు నిత్యావసర వస్తువులను అందజేశారు.
దిల్‌సుఖ్‌నగర్ జోన్: లింగోజిగూడ డివిజన్‌లోని వడ్డెరబస్తీలో నిరుపేద కుటుంబాలకు కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివా్‌సరావు టీఆర్‌ఎస్ నాయకులు జగన్నాథరెడ్డి, శ్రావణ్‌కుమార్, నరసింహగుప్తా, లక్ష్మారెడ్డితో కలిసి పంపిణీ చేశారు. వనస్థలిపురం, ఎఫ్‌సీఐ కాలనీలో కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి పారిశుధ్య కార్మికులకు అన్నదానం చేశారు. రెడ్డి సంక్షేమ సంఘం గ్రేటర్ అధ్యక్షుడు సంరెడ్డి భుజంగరెడ్డి పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టులకు 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం ఆవరణలో 250 మంది పారిశుధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, కూరగాయలను అందించారు.
డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, తుర్కయంజాల్ రైతు సేవా సహాకార సంఘం డైరక్టర్ సామ సంజీవరెడ్డి, రాగన్నగూడ మాజీ సర్పంచ్ కందాడి లక్ష్మారెడ్డి సొంత ఖర్చుతో కార్మికులకు ఆహర పదార్థాలు అందించారు. గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొద్దుల లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో బీఎన్‌రెడ్డినగర్ డివిజన్‌లోని హరిహరపురం కాలనీ, బీఎన్‌రెడ్డినగర్, ఎస్కేడీనగర్ కాలనీలో 300 మందికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
ఎల్‌బీనగర్: మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఇంద్రారెడ్డి ట్రస్ట్ చైర్మన్ కార్తీక్‌రెడ్డి సహకారంతో కార్పొరేటర్ అనితాదయాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, టీఆర్‌ఎస్ సరూర్‌నగర్ అధ్యక్షుడు ఆకుల అరవింద్‌కుమార్, జంగారెడ్డి, కేశవరెడ్డి, శేఖర్‌రెడ్డి, రాఘవేందర్‌గుప్తా సరూర్‌నగర్ డివిజన్‌లోని 400 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులను అందజేశారు.
చాదర్‌ఘాట్: లాక్‌డౌన్‌లో విధులు నిర్వర్తిస్తున్న మలక్‌పేట ట్రాఫిక్ పోలీ స్‌స్టేషన్‌లోని సిబ్బందికి నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్‌కుమార్ శనివారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మలక్‌పేటకు చెందిన సామాజిక కార్యకర్త పురోహిత్ సహకారంతో మాస్క్‌లు, శానిటైజర్లను అందజేశారు. ఇందులో ట్రాఫిక్ డీసీపీ బాబురావు, సుల్తాన్‌బజార్ ట్రా ఫిక్ ఏసీపీ శ్రీనివా్‌సరెడ్డి, మలక్‌పేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ టి.రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ షా హుస్సేన్ పాల్గొన్నారు. ముసారాంబాగ్ తీగలగూడలోని 350 నిరుపేద కుటుంబాలకు సలీంనగర్ మాజీ కార్పొరేటర్ చెకొలేకర్ శ్రీనివా స్ నెలకు సరిపడా నిత్యావసర సరుకులను శనివారం పంపిణీ చేశారు.
మన్సూరాబాద్: మహంకాళీ యూత్ అధ్యక్షుడు గుర్జ ప్రవీణ్‌గౌడ్ ఆధ్వర్యంలో నాగోలు నువ్వులబండలో వలస కార్మికులు, పేదలకు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ శనివారం అల్పాహారాన్ని అందించారు.
వెంకటేశ్వరకాలనీ: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో శనివారం వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని దేవరకొండ బస్తీలో పేదలకు ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. కర్యాక్రమంలో మహాసభ జాతీయప్రధాన కార్యదర్శి కౌటికె విఠల్, సెక్టార్ ఎస్‌ఐ రవీందర్, బాబూ జగ్జీవన్‌రామ్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్: బుడగజంగం బస్తీలో నిరుపేదలు, జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం కాంట్రాక్ట్ సిబ్బందికి కార్పొరేటర్ విజయారెడ్డి శనివారం నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేశారు.
బంజారాహిల్స్: బుల్లితెర కార్మికులకు ఏజీఎస్ సేవా ట్రస్టు నిర్వాహకులు సి.వెంకటగోవిందరావు, ఆశారాణి, సాయినితేష్, నాగేష్ శనివారం ఫిలించాంబర్ వద్ద నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అలాగే ఎంఎస్ మక్తాలో వలస కార్మికులకు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వృక్షమిత్ర ఆధ్వర్యంలో ఖైరతాబాద్, చార్మినార్ ప్రాంతా ల్లో సంస్థ వ్యవస్థాపకుడు ఎంవీ నాగవేందర్‌రావు ని త్యావసరాలతోపాటు ఆహారాన్ని అందజేశారు.
రాంనగర్: సన్‌రైజ్ షటిల్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమేశ్వర్, డాక్టర్ అశోక్, ఆంధ్రజ్యోతి చిక్కడపల్లి జోన్ ఇన్‌చార్జి బొల్లం శ్రీనివా్‌సలు బీజేపీ గ్రేటర్ ఉపాధ్యక్షుడు కె.మాఽధవ్, డివిజన్ అధ్యక్షుడు పి.సాయికృష్ణయాద వ్, నగర నాయకులు సుబ్రహ్మణ్యంబాబు, శేషసాయి సహకారంతో శనివారం అడిక్‌మెట్ డివిజన్‌లోని ఆస్థాన ప్లే గ్రౌండ్‌లో 50 మంది పారిశు ధ్య సిబ్బంది, 20 మంది వలస కూలీలకు అల్పాహారం పంపిణీ చేశారు.
ఓల్డ్ బోయినపల్లి: చిరుద్యోగులు, సెక్యూరిటీ గార్డులు, గృహ సహాయకులు, వలస కార్మికులకు బోయినపల్లిలోని స్వర్ణధామ నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. ప్రతి శనివారం ఇదే విధంగా పంపిణీ చేస్తామని సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర రావు తెలిపారు.
బర్కత్‌పుర: కూచికుళ్ల విమలాసుధాకర్‌రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ దేవిరెడ్డి విజితారెడ్డి ఆధ్వర్యంలో శనివారం 50 మంది దివ్యాంగులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
మియాపూర్: మియాపూర్ ప్రాంతంలో విజయ్‌భారత్ బిల్డర్స్ నర్సింహరాజు, ఆర్‌వీ నిర్మాణ్ ఎల్‌ఎల్‌పీ రామచంద్రన్‌రెడ్డి సుమారు 350 నిరుపేద కుటుంబాలు, మున్సిపల్ కార్మికులు, పోలీసులకు ఆహారం అందజేస్తున్నారని నిర్మాణ సంస్థల భాగస్వామి సుధీర్ తెలిపారు.
హైదర్‌నగర్: భాగ్యనగర్ కాలనీ ఫేజ్-2లో సుమారు 150 మంది వలస కార్మికులకు శనివారం ఎమ్మెల్యే గాంధీ ఆహార పొట్లాలు అందజేశారు. అలాగే హైటెక్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ, నిజాంపేట రోడ్డులోని పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.
ముషీరాబాద్: భోలక్‌ఫూర్‌లోని ప్రముఖ రెస్టారెంట్ స్టార్ హోటల్ యజమానులు యూసు్‌ఫఖాన్, జావేద్‌ఖాన్‌ల ఆధ్వర్యంలో శనివారం పేదలు, పారిశుధ్య కార్మికులకు చికెన్ బిర్యానీ పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులకు ఒక్కొక్కరికి రూ.200 నగదు కూడా అందజేశారు.