పౌరులకు మీ సేవా పోర్టల్‌ లింక్‌..!

ABN , First Publish Date - 2020-10-03T09:14:13+05:30 IST

ధరణిలో ఆస్తుల వివరాలు నమోదు చేయకుంటే మున్ముందు ఇబ్బందేమో అన్న ఆందోళన ఓ వైపు. వివరాల సేకరణకు ..

పౌరులకు మీ సేవా పోర్టల్‌ లింక్‌..!

కరోనాకు చెక్‌ పెట్టే యత్నం

సిబ్బంది ఇంటికి రాకుండానే వివరాల నమోదు


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): ధరణిలో ఆస్తుల వివరాలు నమోదు చేయకుంటే మున్ముందు ఇబ్బందేమో అన్న ఆందోళన ఓ వైపు. వివరాల సేకరణకు ప్రభుత్వ విభాగాల సిబ్బంది ఇళ్ల వద్దకు వస్తే ప్రమాదవశాత్తు కరోనా సోకుతుందేమో అన్న భయం మరో వైపు. ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పెడుతూ ఆస్తుల వివరాలను యజమానులే ఆప్‌లోడ్‌ చేసే అవకాశం కల్పించింది ప్రభుత్వం. మీ సేవా పోర్టల్‌ లింక్‌ను ఆస్తిపన్ను చెల్లింపుదారుల మొబైల్‌ నెంబర్లకు పంపుతోంది. ఆ లింక్‌ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల వివరాలు ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసే వెసులుబాటు కల్పించారు. ధరణిలో ఆస్తుల వివరాలు ఇలా నమోదు చేసుకోవచ్చు.


ఆన్‌లైన్‌లో నమోదై ఉంటే...

పౌరులు నమోదు చేసిన ఆస్తుల వివరాలు ధరణి పోర్టల్‌తోపాటు.. సంబంధింత కార్పొరేషన్‌, మునిసిపాలిటీ, పంచాయతీ అధికారులకు కూడా తెలుస్తుంది. దీంతో మీ ఇల్లు/భవనం వద్దకు సిబ్బంది వచ్చే అవకాశం ఉండదు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన ఆస్తుల వివరాల సేకరణకు సిబ్బంది దాదాపుగా వెళ్లరని, సమాచార లోపంతో వెళ్లినా, అప్పటికే నమోదు చేశామని సంబంధిత యజమానులు చెబితే వెనుతిరుగుతారని జీహెచ్‌ఎంసీ అధికారొకరు తెలిపారు. ‘ఇప్పటికైతే మీ సేవా పోర్టల్‌ యాక్సెస్‌ మాకు రాలేదు. ఒకటి, రెండు రోజుల్లో అనుసంధానం జరుగుతుంది. దీంతో ఆన్‌లైన్‌లో నమోదైన వివరాలు మాకు తెలిసిపోతాయి’ అని చెప్పారు. 

Updated Date - 2020-10-03T09:14:13+05:30 IST