కరోనా కాలం.. ఖననం కష్టం..!

ABN , First Publish Date - 2020-08-14T15:08:15+05:30 IST

ఆసుపత్రుల్లో అడ్మిషన్‌ కావాలంటే సిఫార్సు.. సరిగ్గా చూడాలని డాక్టర్లకు రికమండేషన్‌. బెడ్‌ కావాలనీ, ఆక్సిజన్‌ పెట్టాలనీ.. ఇలా అడుగడుగునా పైరవీ, పలుకుబడి ఉంటేనే కరోనా రోగికి చికిత్స జరిగేది.

కరోనా కాలం..  ఖననం కష్టం..!

క్రైస్తవ సిమెట్రీల్లో స్థలాల కొరత

అధికారికంగా పదమూడే..


రెజిమెంటల్‌బజార్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : ఆసుపత్రుల్లో అడ్మిషన్‌ కావాలంటే సిఫార్సు.. సరిగ్గా చూడాలని డాక్టర్లకు రికమండేషన్‌. బెడ్‌ కావాలనీ, ఆక్సిజన్‌ పెట్టాలనీ.. ఇలా అడుగడుగునా పైరవీ, పలుకుబడి ఉంటేనే కరోనా రోగికి చికిత్స జరిగేది. ఇవన్నీ రోగిని బతికించడం కోసం జరిగేవి. వీటన్నింటినీ మించిన పలుకుబడి ప్రదర్శించాల్సిన మరో సందర్భం వచ్చి పడ్డదిప్పుడు. అది.. రోగి మరణించిన తర్వాత అవసరం పడేది. శ్మశానంలో జాగా. ఆ జాగా కోసం.. వ్యాధి పీడితుడి బంధువులు పడుతున్న పాట్లు ఇవి. 


ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న క్రైస్తవ కుటుంబాలకు సిమె ట్రీలలో (శ్మశానాల్లో) స్థలం కొరత మరింత ఆవేదనను మిగుల్చుతోంది. కరోనా కాలంలో ఈ అవస్థలు ఎక్కువయ్యాయి. క్రైస్తవ సంప్రదా యం ప్రకారం ఎవరైనా మరణిస్తే ఖననం చేస్తారు. ప్రస్తుతం  సిమెట్రీలన్నీ సమాధులతో నిండిపో యాయి. మెట్టుగూడ సిమెట్రీలో స్థలం లేదు. బోయిగూడ, తిరుమలగిరిలలో స్థలం ఉన్నప్పటికీ స్థానికులు అక్కడ ఖననం చేయటానికి ఇష్టపడటం లేదు.


15 లక్షల మందికి 70 సిమెట్రీలు..

జంటనగరాల్లో 15 లక్షల మంది క్రైస్తవ జనాభా ఉంది. 70 సిమెట్రీలు ఉన్నాయి. అందులో 13 సిమెట్రీలు మాత్రమే అధికారంగా ఉన్నాయి. మిగతా 57 క్రైస్తవులు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. కొవిడ్‌ మృతదేహాలకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు వెచ్చించి సొంత ఖర్చులతో నగరం బయట ఉన్న సిమె ట్రీలలో ఖననం చేస్తున్నారు.


ప్రభుత్వంపై నమ్మకం ఉంది   

సిమెట్రీల సమస్య పరిష్కారం విషయమై బిషప్‌ తుమ్మబాల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. నూతన సిమెట్రీల నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు. ఇది ఇప్పటి సమస్య కాదు. ఎప్పటి నుంచో ఉంది. ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. 

- రెవరెండ్‌ మోన్సిగ్నర్‌ స్వర్ణ బెర్నార్డ్‌, సెయింట్‌ మేరీస్‌, సికింద్రాబాద్‌.


కొవిడ్‌తో తప్పు పట్టలేము

మామూలు రోజుల్లోనే సిమెట్రీలలో స్థలం కొరత ఉంది. ఇప్పుడు కొవిడ్‌తో మరణించిన వారిని ఖననం చేయడం భారంగా మారింది. కనీసం భార్యాపిల్లలు కూడా దగ్గరికి వెళ్లలేని పరిస్థితి. 

- పాస్టర్‌ భాస్కర్‌ (వెస్లీచర్చి, సికింద్రాబాద్‌) 

Updated Date - 2020-08-14T15:08:15+05:30 IST