లాల్‌దర్వాజ ఆలయ చైర్మన్‌గా లక్ష్మీనారాయణగౌడ్‌

ABN , First Publish Date - 2020-05-18T09:18:30+05:30 IST

లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయం చైర్మన్‌గా జె.లక్ష్మీనారాయణ గౌడ్‌ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు.

లాల్‌దర్వాజ ఆలయ చైర్మన్‌గా లక్ష్మీనారాయణగౌడ్‌

మదీన, మే 17(ఆంధ్రజ్యోతి): లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయం చైర్మన్‌గా జె.లక్ష్మీనారాయణ గౌడ్‌ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఆలయంలో కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు కొద్దిమంది కమిటీ సభ్యుల సమక్షంలో లక్ష్మీనారాయణగౌడ్‌ను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. త్వరలోనే కమిటీ మరోసారి సమావేశమై బోనాల ఉత్సవాలను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ విఽధంగా నిర్వహించాలో చర్చిస్తామని వెల్లడించారు.

Read more