బడంగ్‌పేట్‌ కమిషనర్‌గా కృష్ణమోహన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-07-10T10:01:02+05:30 IST

బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు నూతన కమిషనర్‌గా టి.కృష్ణమోహన్‌రెడ్డిని నియమిస్తూ మునిసిపల్‌ పరిపాలన శాఖ

బడంగ్‌పేట్‌ కమిషనర్‌గా కృష్ణమోహన్‌రెడ్డి

సరూర్‌నగర్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు నూతన కమిషనర్‌గా టి.కృష్ణమోహన్‌రెడ్డిని నియమిస్తూ మునిసిపల్‌ పరిపాలన శాఖ ఉత్తర్వులు(జీవో ఆర్‌టీ నం.282) జారీ చేసింది. ప్రస్తుతం బడంగ్‌పేట్‌ కమిషనర్‌గా ఉన్న సత్యబాబును జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేశారు. కృష్ణమోహన్‌రెడ్డి మునిసిపల్‌ కమిషనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన గతంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. శుక్రవారం సత్యబాబు నుంచి కృష్ణమోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. సత్యబాబు జవహర్‌నగర్‌లో రిపోర్ట్‌ చేయనున్నారు.


ఆర్‌వోగా చంద్రశేఖర్‌రెడ్డి..

బోడుప్పల్‌లో మేనేజర్‌గా పని చేసిన డి.చంద్రశేఖర్‌రెడ్డి బడంగ్‌పేట్‌ రెవెన్యూ అధికారిగా నియమితులయ్యారు. ఇక్కడ ఆర్‌వోగా పని చేసిన సురేశ్‌రెడ్డిని బోడుప్పల్‌ కార్పొరేషన్‌కు మేనేజర్‌గా బదిలీ చేశారు. చంద్రశేఖర్‌రెడ్డి గురువారమే బాధ్యతలు స్వీకరించారు.  

Updated Date - 2020-07-10T10:01:02+05:30 IST