టీఆర్‌ఎ్‌సకు బుద్ధి చెప్పాలి: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-11-07T09:16:23+05:30 IST

టీఆర్‌ఎ్‌సకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం యూసు్‌ఫగూడలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి

టీఆర్‌ఎ్‌సకు బుద్ధి చెప్పాలి: కిషన్‌రెడ్డి

యూసు్‌ఫగూడ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎ్‌సకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం యూసు్‌ఫగూడలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ కన్వీనర్‌ ప్రేమ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఎన్నికల ముందు రెండుపడకల ఇళ్లు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని, ఆరు సంవత్సరాలు గడిచినా ఆ ఊసేలేకుండా ఉన్నారన్నారు. ఎన్ని ఇళ్లుకట్టినా కేంద్ర ప్రభుత్వ సహాయం అందిస్తామన్నా పట్టించుకోలేదని ఆరోపించారు. వరదలొచ్చి వేల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ వారిని పరామర్శించలేదని విమర్శించారు.


వరద బాధితులకు పది వేలు సహాయం చేస్తామని చెప్పారని, బాధితులకు రెండు మూడువేలు చేతిలో పెట్టి మిగతావి టీఆర్‌ఎస్‌ నాయకులు జేబుల్లో వేసుకుంటున్నారని ఆరోపించారు. కిషన్‌రెడ్డి సమక్షంలో పలుప్రాంతాలకు చెందిన వారు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో అంబర్‌పేట, బర్కత్‌పురా జిల్లా అధ్యక్షుడు గౌతమ్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, సీనియర్‌ నాయకులు బంగారు ప్రశాంత్‌, కైలా్‌షనాథ్‌, ప్రేమ్‌కుమార్‌, కుంబాల గంగరాజు, భవర్‌లాల్‌ వర్మ, అట్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-07T09:16:23+05:30 IST