బాలుడి కిడ్నాప్‌ కథ సుఖాంతం

ABN , First Publish Date - 2020-12-26T06:07:35+05:30 IST

జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో బాలుడి కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. కేవలం గంటన్నరలో కిడ్నాప్‌కు గురైన బాలుడిని సురక్షితంగా రక్షించారు.

బాలుడి కిడ్నాప్‌ కథ సుఖాంతం
కిడ్నాపర్‌ నుంచి బాలుడిని తీసుకుంటున్న సీఐ బాలరాజు

జీడిమెట్ల, డిసెంబర్‌ 25(ఆంధ్రజ్యోతి): జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో బాలుడి కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. కేవలం గంటన్నరలో కిడ్నాప్‌కు గురైన బాలుడిని సురక్షితంగా రక్షించారు. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. షాపూర్‌నగర్‌ సంజయ్‌గాంధీనగర్‌లో నివాసం ఉండే శ్రీకాంత్‌ కుమారుడు రామకృష్ణ(13 నెలలు)ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని మధ్యాహ్నం 12 గంటలకు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే అప్రమత్తమైన సీఐ బాలరాజు, ఎస్సైలు మన్మథ్‌, సుమన్‌, గౌతం, సిబ్బంది సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల బృందం ముమ్మర గస్తీ నిర్వహించారు. గంటన్నర వ్యవధిలోనే మహిళా కిడ్నాపర్‌ షాపూర్‌నగర్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా పట్టుకుని బాలుడిని సురక్షితంగా కాపాడారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. స్థానిక యువకులు పోలీస్‌ స్టేషన్‌లో పెట్రోలింగ్‌ సిబ్బంది, సీఐ బాలరాజు, ఎస్సైలను సన్మానించారు. 




Updated Date - 2020-12-26T06:07:35+05:30 IST