‘కక్షిదారులకు న్యాయం చేయాలి’

ABN , First Publish Date - 2020-12-15T06:03:21+05:30 IST

రాష్ట్రంలోని అన్ని కోర్టులను తెరిచి కక్షిదారులకు వెంటనే న్యాయం అందించడానికి చర్యలు చేపట్టాలని పలు సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు

‘కక్షిదారులకు న్యాయం చేయాలి’

బర్కత్‌పుర: రాష్ట్రంలోని అన్ని కోర్టులను తెరిచి కక్షిదారులకు వెంటనే న్యాయం అందించడానికి చర్యలు చేపట్టాలని పలు సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ సందర్బంగా కోర్టులలో ఆన్‌లైన్‌ సేవలుమాత్రమే కొనసాగుతున్నాయని, దీనివల్ల అనేక వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా దివ్యాంగులు, పేదలు నానా అవస్థలు పడుతున్నారని వారు అన్నారు. సోమవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో లాయర్స్‌ ఫోరం ఫర్‌ సోషల్‌జస్టిస్‌ అధ్యక్షుడు నాగుల శ్రీనివా్‌సయాదవ్‌, సెక్రటరీ జనరల్‌ సామల రవీందర్‌, నవతెలంగాణ అడ్వకేట్స్‌ ఫోరం అధ్యక్షుడు నాగేందర్‌, ఇండియన్‌ లీగల్‌ ప్రొఫెషనర్స్‌ లాయర్స్‌ అధ్యక్షుడు టి.భక్తివత్సలం, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది గుండ్రాతి శారదాగౌడ్‌, సీనియర్‌న్యాయవాది తదితరులు మాట్లాడారు.

Updated Date - 2020-12-15T06:03:21+05:30 IST