నేడు జర్నలిస్టుల ధర్నాలు : టీడబ్ల్యూజేఎఫ్‌

ABN , First Publish Date - 2020-05-18T09:17:44+05:30 IST

కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలని కోరుతూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ..

నేడు జర్నలిస్టుల ధర్నాలు : టీడబ్ల్యూజేఎఫ్‌

చిక్కడపల్లి, మే 17(ఆంధ్రజ్యోతి): కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలని కోరుతూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌(టీడబ్ల్యూజేఎ్‌ఫ) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టులు కరోనా నియంత్రణ నిబంధనలు పాటిస్తూ ధర్నాలు చేసి కలెక్టర్లకు వినతిపత్రాలు సమ ర్పిస్తామని పేర్కొన్నారు.


జర్నలిస్టుల్లో తీవ్ర ఆందోళన, నిరాశానిస్పృహలు పెరిగిపోయాయని, ప్రభుత్వం ఆదుకోకపోతే అనేక కుటుంబాలు రోడ్డునపడతాయని  ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా అకాడమీకి జర్నలిస్టుల సంక్షేమ నిధిని పెంచి ప్రతి జర్నలిస్టుకు నెలకు రూ.10 వేల సహాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కరోనా వైరస్‌ నివారణకు జర్నలిస్టులు కూడా కృషి చేస్తున్నారని, జర్నలిస్టులకు రూ.25 లక్షల ఇన్సూరెన్స్‌ ప్యాకేజీని ప్రకటించాలని వారు కోరారు. 

Updated Date - 2020-05-18T09:17:44+05:30 IST