ఉద్యోగం.. ఆరోగ్యం రెండూ ముఖ్యమే

ABN , First Publish Date - 2020-02-16T08:41:14+05:30 IST

పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవాలని డీసీపీ అనసూయ సూచించారు.

ఉద్యోగం.. ఆరోగ్యం రెండూ ముఖ్యమే

డీసీపీ అనసూయ 

 సైబరాబాద్‌లో ఉచిత వైద్య శిబిరం


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవాలని డీసీపీ అనసూయ సూచించారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో మహిళా ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ డీసీపీ అనసూయ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు  ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలన్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిదన్నారు. పరీక్షల్లో ఏదైనా అనారోగ్యం ఉన్నట్లు తేలితే ఉన్నతాధికారులకు వివరించి ప్రాథమిక స్థాయిలోనే ఆరోగ్య భద్రత ద్వారా తగిన చికిత్సలు చేయించుకోవాలన్నారు. సైబరాబాద్‌ పోలీస్‌, యశోద, ఎఫ్‌ఎంఎస్‌ డెంటల్‌, డాక్టర్‌ అగర్వాల్‌ ఐ ఆస్పత్రుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగినులకు పలు పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీసీపీ క్రైమ్‌-1 కవిత, ఏడీసీపీ క్రైమ్‌-2 ఇందిర, ఏడీసీపీ (అడ్మిన్‌) లావణ్య, డాక్టర్లు రమ్య, శైలజ, సుష్మ, చైతన్య, ఫాతిమా, సీటీసీ డాక్టర్‌ సుకుమార్‌, డా. సరిత, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-16T08:41:14+05:30 IST