అవయవదాతకు జీవన్‌దాన్‌ స్మృత్యంజలి

ABN , First Publish Date - 2020-11-03T09:28:36+05:30 IST

అవయవదానం చేసిన ఓ దాతకు జీవన్‌దాన్‌ స్మృత్యంజలి ఘటించింది. అవయవదానంపై మరింత అవగాహన పెంచేందుకు జీవన్‌దాన్‌ మరొ కొత్త పంథాను అవలంబించింది

అవయవదాతకు జీవన్‌దాన్‌ స్మృత్యంజలి

సనత్‌నగర్‌/హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): అవయవదానం చేసిన ఓ దాతకు జీవన్‌దాన్‌ స్మృత్యంజలి ఘటించింది. అవయవదానంపై మరింత అవగాహన పెంచేందుకు జీవన్‌దాన్‌ మరొ కొత్త పంథాను అవలంబించింది. బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలు దానం చేసిన ఆ కుటుంబాన్ని అభినందించి తమ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసింది. పురానాపూల్‌లోని దుర్గాకాలనీకి చెందిన దండు నర్సింగ్‌రావుగౌడ్‌(62) సిటీసివిల్‌ కోర్టులో న్యాయవాదిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. అక్టోబర్‌ 19న అకస్మాత్తుగా కింద పడిపోవడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. గ్లోబల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గత నెల 21న బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో జీవన్‌దాన్‌ ప్రతినిధులు కుటుంబ సభ్యులను ఒప్పించి, అతడి కాలేయం, రెండు కార్నియాలు సేకరించి బాధితులకు అమర్చారు. సోమవారం జియాగూడలో నర్సింగ్‌రావుగౌడ్‌ దశదిన కర్మ ఉండడంతో అక్కడికి చేరుకున్న జీవన్‌దాన్‌ సిబ్బంది మృతుడి కుటుంబ సభ్యులను సన్మానించి అభినందించారు. 

Updated Date - 2020-11-03T09:28:36+05:30 IST