దళిత పారిశ్రామికవేత్తలకు ఆర్థిక తోడ్పాటు

ABN , First Publish Date - 2020-09-13T08:53:59+05:30 IST

దళిత పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, ..

దళిత పారిశ్రామికవేత్తలకు ఆర్థిక తోడ్పాటు

డిక్కీ బిజినెస్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ప్రారంభంలో జయేష్‌ రంజన్‌


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): దళిత పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయే్‌షరంజన్‌ అన్నారు. హైదరాబాద్‌లో శనివారం దళిత్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(డిక్కీ) కార్యాలయంలో బిజినెస్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ దళితులు పరిశ్రమలు నెలకొల్పి వ్యాపారాలు చేయడమే కాకుండా వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా డిక్కీ నాయకత్వం కృషి చేయడం హర్షణీయమన్నారు. ఇప్పటి వరకు లాభసాటి వ్యాపారాలు ఎంచుకోవడంలో ఎదురైన ఇబ్బందులను తొలగిస్తూ సలహా సేవాకేంద్రం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆహార, ఔషధ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరారు. భవిష్యత్తులో మహిళా పారిశ్రామిక వేత్తలు ఎక్కువ మంది ఎదిగి రావాలని, అందుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీచ్చారు.


టీఎ్‌సఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఎంఎ్‌సఎంఈ  ఇండసి్ట్రీయల్‌ అడ్వైజర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి నిబద్ధతతో సహకారం అందిస్తుందని తెలిపారు. డిక్కీ నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్రా రవికుమార్‌ మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ఆర్థికంగా ఎదిగేందుకు దళితులకు ప్రభుత్వాలు మరింతగా ప్రోత్సాహం అందించాలని కోరారు. కార్యక్రమంలో డిక్కీ ప్రెసిడెంట్‌ రవికుమార్‌, అరుణ మునీందర్‌, సృజన్‌, సురేష్‌, మహిళా విభాగం ఇన్‌చార్జి ఎస్‌.కృష్ణవేణి, నర్రా వనజాక్షి, సంపూర్ణ, విశాలాక్షి, శ్రీవల్లి, శ్రీమ, లలిత, పరమేష్‌, చంద్రశేఖర్‌, రమేష్‌, శంకర్‌ పాల్గొన్నారు

Updated Date - 2020-09-13T08:53:59+05:30 IST