జయహో..జనతా..
ABN , First Publish Date - 2020-03-23T09:15:26+05:30 IST
కాలనీలు, బస్తీలు, రహదారులు... ప్రాంతమేదైనా నిశ్శబ్దం..బస్టాపులు, మెట్రో, రైల్వే స్టేషన్లు... ఎక్కడైనా.. నిశ్శబ్దం ఆటో, బస్సు, కారు, బైకు.. ఏ హారను మోత వినపడని నిశ్శబ్దం..ఎవరూ ఊహించని.. ఎన్నడూ కనిపించని.. నిశ్శబ్ద నగరం...మనిషన్న వాడు రోడ్డెక్కకపోతే ఇలా ఉంటుందా..? అని ఆశ్చర్యపోయోలా జనతా కర్ఫ్యూ కొనసాగింది..

ఆదివారం ఉదయం నుంచీ...
కాలనీలు, బస్తీలు, రహదారులు... ప్రాంతమేదైనా నిశ్శబ్దం..బస్టాపులు, మెట్రో, రైల్వే స్టేషన్లు... ఎక్కడైనా.. నిశ్శబ్దం ఆటో, బస్సు, కారు, బైకు.. ఏ హారను మోత వినపడని నిశ్శబ్దం..ఎవరూ ఊహించని.. ఎన్నడూ కనిపించని.. నిశ్శబ్ద నగరం...మనిషన్న వాడు రోడ్డెక్కకపోతే ఇలా ఉంటుందా..? అని ఆశ్చర్యపోయోలా జనతా కర్ఫ్యూ కొనసాగింది..5 గంటలకు... ఒక్కసారిగా చప్పట్లు మోతెక్కాయి. అపార్ట్‌మెంట్ల బాల్కనీలు.. ఇండిపెండెంట్ ఇళ్ల ముంగిళ్లలో జనం సందడి చేశారు. చప్పట్లు కొడుతూ కరోనా బాధితులకు సేవలందిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.