ఇన్‌స్పెక్టర్ల బదిలీ

ABN , First Publish Date - 2020-12-15T06:37:18+05:30 IST

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నలుగురు ఇన్పెక్టర్లకు పదోన్నతులు కల్పిస్తూ సీపీ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.

ఇన్‌స్పెక్టర్ల బదిలీ

పంజాగుట్ట, డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నలుగురు ఇన్పెక్టర్లకు పదోన్నతులు కల్పిస్తూ సీపీ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఓయూ పోలీస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌. రాజశేఖర్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌కు, జూబ్లీహిల్స్‌ ఎస్‌హెచ్‌ఓ కె. సత్తయ్యను సీసీసీకి, నల్లకుంట ఇన్పెక్టర్‌ కె. మురళీధర్‌ను పంజాగుట్ట ట్రాఫిక్‌ స్టేషన్‌కు, పంజాగుట్ట ట్రాఫిక్‌ ఎస్‌హెచ్‌ఓగా పనిచేస్తున్న ఎం. రవిని నల్లకుంట పోలీస్టేషన్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.

Updated Date - 2020-12-15T06:37:18+05:30 IST