బసవ తారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిలో..

ABN , First Publish Date - 2020-08-16T09:42:20+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బసవ తారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిలో జాతీయ జెండాను ఆస్పత్రి చైర్మన్‌

బసవ తారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిలో..

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బసవ తారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిలో జాతీయ జెండాను ఆస్పత్రి చైర్మన్‌ నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. ముందుగా ఆయన దివంగత ఎన్టీఆర్‌ దంపతుల విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ సమయంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలందిస్తున్న వైద్య, ఇతర సిబ్బందిని ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సీఈవో ప్రభాకరరావు, సీవోవో రవికుమార్‌, మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టీఎ్‌సఎన్‌రావు, అసోసియేట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కల్పానారఘునాథ్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఫణీ కోటేశ్వరరావు, వైద్యులు చంద్రశేఖర్‌రావు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-08-16T09:42:20+05:30 IST