మువ్వన్నెల జెండా రెపరెపలు
ABN , First Publish Date - 2020-08-16T09:29:18+05:30 IST
రహ్మత్‌నగర్ డివిజన్‌లోని దళిత్ స్టడీ సర్కిల్ ప్రాంగణంలో స్థానిక నాయకులు 60 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన

నగర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవం
జోరు వానను లెక్క చేయకుండా నగరంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కాలనీలు, బస్తీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. హంగూ, ఆర్భాటం లేకుండా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, భౌతిక దూరం పాటిస్తూ వేడుకలు జరుపుకొన్నారు.
జూబ్లీహిల్స్ పరిధిలో..
ఎర్రగడ్డ/కృష్ణానగర్ ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): రహ్మత్‌నగర్ డివిజన్‌లోని దళిత్ స్టడీ సర్కిల్ ప్రాంగణంలో స్థానిక నాయకులు 60 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గంలోని శ్రీరామ్‌నగర్, వెంగళరావునగర్, యూసు్‌ఫగూడలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఎర్రగడ్డలోని సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ప్రణయ్ కుమార్ జెండాను ఎగరవేశారు.
ఖైరతాబాద్ పరిధిలో...
బంజారాహిల్స్: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ జెండా ఆవిష్కరించి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్పొరేటర్లు కాజా సూర్యనారాయణ, గద్వాల్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ వివేక్, బీజేపీ నాయకులు పల్లపు గోవర్ధన్, వెల్దండ వెంకటేష్, టీపీసీసీ కార్యదర్శి డాక్టర్ సింగిరెడ్డి రోహిణ్‌రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రావణ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
ఖైరతాబాద్: మింట్ కాంపౌండ్‌లోని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కార్యాలయంలో సీఎండీ రఘుమారెడ్డి, జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ ప్రావీణ్య, ఇన్‌స్ట్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో చైర్మన్ డాక్టర్ రామేశ్వరరావు, సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ చింతల సైదిరెడ్డి, ఖైరతాబాద్‌లోని పలుప్రాంతాల్లో కార్పొరేటర్ విజయారెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎస్‌కే షరీఫ్ వేర్వేరుగా జెండా ఎగురవేశారు.
సనత్‌నగర్ పరిధిలో...
బేగంపేట/అమీర్‌పేట: బేగంపేటలోని బస్తీ దవాఖానాలో డాక్టరు వి.సుజాత, స్వామి రామానంద స్మారక సంస్థలో సంస్థ చైర్ పర్సన్ వాణీదేవి, ప్రకాశ్‌నగర్‌లో టీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాజయ్య, శ్యామ్‌లాల్ బిల్డింగ్‌లో బీజేపీ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు నెమలి ఆనంద్, అమీర్‌పేటలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వీవీఎల్ చంద్రకళ, ఎస్సార్‌నగర్ పోలీ్‌సస్టేషన్‌లో సీఐ మురళీకృష్ణ, సత్యం టాకీస్ చౌరస్తాలో కార్పొరేటర్ శేషుకుమారి జెండాను ఎగురవేశారు.
సికింద్రాబాద్ పరిధిలో...
సికింద్రాబాద్ : రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌లో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారం రోజులుగా చేపట్టిన ప్రత్యేక పరిశుభ్రతా కార్యక్రమాలకు గుర్తుగా జనరల్ మేనేజర్, మహిళా సంక్షేమ సంఘం సభ్యులు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మొక్కలు నాటారు. కంటోన్మెంట్‌లోని ఆయా ప్రాంతాల్లో బోర్డు పాలక మండలి ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణ, మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, బాణుక నర్మదా మల్లికార్జున్, సభ్యులు కె.పాండుయాదవ్, పి.నళినీకిరణ్, లోకనాథం, బీజేపీ కంటోన్మెంట్ ఇన్‌చార్జ్ మాచర్ల శ్రీనివాస్, టీఆర్‌ఎస్ నాయకులు గజ్జల నాగేష్, సత్యనారాయణగౌడ్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.
అడ్డగుట్ట : అడ్డగుట్ట బాబూ జగ్జీవన్‌రాం కమ్యూనిటీహాలులో కార్పొరేటర్ విజయ కుమారి, ఇందిరాలక్ష్మీనగర్‌లో, తుకారాంగేట్ సర్కిల్‌లో ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప, తుకారాంగేట్ చౌరస్తాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అల్లం రాజేశ్వర్, అడ్డగుట్టలో సీపీఎం, జన తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
బౌద్ధనగర్ : సీతాఫల్‌మండి, బౌద్ధనగర్ డివిజన్లలో కార్పొరేటర్లు సామల హేమ, భైరగోని ధనంజనగౌడ్, నాయకులు కరాటే రాజు, దయానంద్‌గౌడ్, సుంకు రామచందర్, ప్రభుగుప్తా, రాచమల్ల కృష్ణమూర్తి, టీడీపీ సికింద్రాబాద్ ఇన్‌చార్జ్ వల్లారపు శ్రీనివా్‌సకుమార్, డిప్యూటీ స్పీకర్ కుమారుడు తీగుళ్ల కిరణ్‌కుమార్‌గౌడ్ తదితరులు జాతీయజెండాను ఎగురవేశారు. సీతాఫల్‌మండిలో పీసీసీ కార్యదర్శి బండ చంద్రారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నగర ఉపాధ్యక్షుడు బండపల్లి సతీ్‌షగౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
రాంగోపాల్‌పేట్ : ఓల్డ్ బోయిగూడలో రాంగోపాల్‌పేట్ కార్పొరేటర్ అత్తెల్లి అరుణా శ్రీనివాస్ గౌడ్, సికింద్రాబాద్ రాణిగంజ్ బాంబే హోటల్ చౌరస్తాలో రాణిగంజ్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు, రాణిగంజ్ పాన్ బజార్‌లో సనత్ నగర్ నియోజకవర్గ ఎ బ్లాక్ ఉపాధ్యక్షుడు త్రికాల మనోజ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
కూకట్‌పల్లి పరిధిలో...
కూకట్‌పల్లి: కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీకాలనీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. జేఎన్‌టీయూహెచ్‌లో యూనివర్సిటీరెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, కూకట్‌పల్లిలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో బీజేపీ సీనియర్ నాయకుడు సీహెచ్ హనుమంతరావు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మాధవరం కాంతారావు పాల్గొన్నారు. కూకట్‌పల్లి పీఎ్‌సలో నిర్వహించిన వేడుకల్లో సీఐ లక్ష్మీనారాయణరెడ్డి, జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో జడ్సీ వి.మమత, సుమిత్రానగర్, చైనత్యనగర్ కాలనీల్లో కాలనీ అధ్యక్షుడు ఇ.సోమయ్య యాదవ్ జాతీయ జెండాను ఎగురవేశారు.
బాలానగర్/ఓల్డుబోయినపల్లి/ఫతేనగర్: ఓల్డుబోయినపల్లిలోని టీఆర్‌ఎస్ కార్యాలయం వద్ద కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్, బాలానగర్ వార్డు కార్యాలయం వద్ద కార్పొరేటర్ నరేంద్రాచార్య, ఫతేనగర్ వార్డు కార్యాలయం వద్ద సతీ్‌షగౌడ్, బాలానగర్ దళిత సంక్షేమం కార్యాలయం వద్ద సంఘం అధ్యక్షుడు శ్రీనివా్‌సరావు, తెలంగాణ మైనారిటీస్ మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కార్యాలయం దగ్గర అధ్యక్షుడు షేక్ ఉమర్ జెండాను ఆవిష్కరించారు. బాలానగర్ బీహెచ్‌ఈఎల్ ఆర్‌అండ్‌డీలో సంస్థ జీఎం రత్ననౌ ఆచార్య, బాలానగర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్)లో డైరెక్టర్ శశిబాలాసింగ్, ఫిరోజ్‌గూడలో యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు యుగంధర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
శేరిలింగంపల్లి పరిధిలో...
శేరిలింగంపల్లి జోన్‌బృందం: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. హఫీజ్‌పేటలో కార్పొరేటర్లు జగదీశ్వర్‌గౌడ్, పూజిత, హఫీజ్‌పేట సాయినగర్‌లో బీజేపీ రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్రప్రసాద్, భెల్‌ఎంఐజీ కాలనీలో కార్పొరేటర్ సింధూ ఆదర్శరెడ్డి, చందానగర్ భవానీపురంలో మాజీ సైనిక ఉద్యోగులు, రాయదుర్గంలో కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
రాయదుర్గం: గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినె్‌స(ఐఎ్‌సబీ)లో బంధన్ పేరుతో ఆన్‌లైన్‌లో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఇన్‌చార్జీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ రహ్మతుల్లా, సీఆర్ ఫౌండేషన్‌లో కె.నారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఫౌండేషన్‌లో తీసుకున్న జాగ్రత్తల గురించి పరుచూరి జమున, తమ్మారెడ్డి టాన్యా, డాక్టర్ సరస్వతి రచించిన ‘లాక్‌డౌన్ ప్రస్థానం’ పుస్తకాన్ని సీఆర్‌ఎఫ్ వృద్ధాశ్రమంలో నారాయణ ఆవిష్కరించారు.
కుత్బుల్లాపూర్ పరిధిలో..
కుత్బుల్లాపూర్/దుండిగల్/షాపూర్‌నగర్/ పేట్‌బషీరాబాద్/ ప్రగతినగర్: కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల కార్యాలయాల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీల్లో టీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు కేఎం గౌరీష్, సూరారం అంబేడ్కర్ భవన్ వద్ద కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, కొంపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, కుత్బుల్లాపూర్ గ్రామంలోని సీనియర్ సిటిజన్ భవనం వద్ద టీఆర్‌ఎస్ నాయకుడు కేఎం ప్రతాప్ జెండాను ఆవిష్కరించారు. ఏనుగుల చౌరస్తా వద్ద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు.
మెహిదీపట్నం పరిధిలో...
మెహిదీపట్నం జోన్ బృందం : కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాలతో పాటు మణికొండ, నార్సింగ్, బండ్లగూడ ప్రాంతాల్లో శనివారం స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్వాన్ నియోజకవర్గంలోని మెహిదీపట్నం, నానాల్‌నగర్, కార్వాన్, గుడిమల్కాపూర్‌లలో నాయకులు త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు.