కోరలు చాస్తున్న కరోనా..

ABN , First Publish Date - 2020-07-18T09:41:14+05:30 IST

కరోనా సృష్టిస్తున్న కల్లో లంతో నగర జీవి అతలాకుతలం అవుతున్నాడు. బయట తిరగొద్దని చెబుతు న్నా ఎవరూ

కోరలు చాస్తున్న కరోనా..

వెంటాడుతున్న వైరస్‌  పెరుగుతున్న పాజిటివ్‌లు


సిటీ న్యూస్‌ నెట్‌వర్క్‌, జూలై 17(ఆంధ్రజ్యోతి): కరోనా సృష్టిస్తున్న కల్లో లంతో నగర జీవి అతలాకుతలం అవుతున్నాడు. బయట తిరగొద్దని చెబుతు న్నా ఎవరూ వినకపోవడంతో ఎక్కడ వైర్‌సబారిన పడతామో అని భయప డుతున్నాడు. నగరంలో వెలుగు చూస్తున్న పాజిటివ్‌ కేసులతో మరింత ఆందోళన చెందుతున్నాడు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 806 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.  


కుత్బుల్లాపూర్‌లో 78 మందికి.. 

కుత్బుల్లాపూర్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని మూడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తోపాటు దుండిగల్‌లోని ఆరోగ్య కేంద్రం పరిధిలో 78 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయా ఆస్పత్రుల్లో మొత్తం 334 మందికి పరీక్షలు నిర్వహించారు.  కుత్బుల్లాపూర్‌ యూపీహెచ్‌సీలో 35మందిలో 13 మందికి, గాజులరామారం యూపీహెచ్‌సీలో 55 మందిలో 10 మందికి, దుండిగల్‌ పీఎచ్‌సీలో 154 మందిలో 43 మందికి, షాపూర్‌నగర్‌ యూపీహెచ్‌సీలో 60 మందిలో 12 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. 


జవహర్‌నగర్‌లో.. 

జవహర్‌నగర్‌లో కార్పొరేషన్‌ పరిధిలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో 20 మం దికి కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. అయితే, పాజిటివ్‌ల వివరాలను పోలీసుల, మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సకాలంలో వెల్లడించడంలో వైద్యాధికారులు విఫలవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేషన్‌ పరిధిలో ఇప్పటి వరకు 40కి పైగా కరోనా కేసులు ఉన్నాయి. 

 

రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో..  

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో 8 మంది కరోనా బారిన పడినట్లు డిప్యూటీ కమిషనర్‌ ప్రదీ్‌పకుమార్‌ తెలిపారు. అత్తాపూర్‌లో నలుగురికి, శివరాంపల్లి లో ఒకరికి, హసన్‌నగర్‌లో ఇద్దరికి, బుద్వేల్‌లో ఒకరికి  పాజిటివ్‌గా వచ్చినట్లు తేలింది. 


60 మందికి పాజిటివ్‌

రంగారెడ్డి డీఎంహెచ్‌వో పరిధిలో శివరాంపల్లి, హసన్‌నగర్‌ల్లోని అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో 132 మంది ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇం దులో 60 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సృజన తెలిపారు. శివరాంపల్లిలో 66 మందికి పరీక్షలు నిర్వహించగా, 30 మందికి, హసన్‌నగర్‌లో 66 మందికి పరీక్షలు చేయగా 30 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. కాగా, కిట్ల కొరత కారణంగా మైలార్‌దేవుపల్లి అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించలేదు. శివరాంపల్లిలోనూ శుక్రవారంతో కిట్లు అయిపోయినట్లు వైద్యాధికారులు తెలిపారు. 


పాతబస్తీలో 48 కేసులు 

పాతబస్తీలోని ఏడు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో 330 మందికి ర్యాపిడ్‌ పరీక్ష లు నిర్వహించగా, 48 మందికి పాజిటివ్‌ వచ్చింది. పంజేషా-1 అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌సెంటర్‌లో 22మందిలో ఇద్దరికి, అమాన్‌నగర్‌లో 31 మందికిగాను, అం దరికీ, ఈదీబజార్‌లో 67 మందిలో 22 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిం ది. పార్వతీనగర్‌లో 56 మందికి పరీక్షలు నిర్వహించగా 12 మందికి, రక్షాపురంలో 11 మందిలో అందరికీ, బండ్లగూడలో 25మందిలో అందరికీ, మైసారం లో 118 మందిలో 12 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. 


కూకట్‌పల్లిలో 36 మందికి..  

కూకట్‌పల్లి ప్రాంతంలో 36 మందికి కరోనా సోకింది. మూసాపేట సర్కిల్‌ పరిధిలో 25 కేసులు, కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలో 11 కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. 


నేరేడ్‌మెట్‌లో 17 మందికి..  

నేరేడ్‌మెట్‌ మాతృపురి కాలనీలోని మల్కాజిగిరి పీహెచ్‌సీలో 50 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 17 మందికి పాజిటివ్‌ వచ్చింది. మౌలాలి యూపీహెచ్‌సీలో 25 మందికి గానూ నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. 


రామంతాపూర్‌, హబ్సిగూడల్లో.. 

రామంతాపూర్‌, హబ్సిగూడల పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఒక వైద్యురాలు, ఐదేళ్ల బాలుడితోపాటు నలుగురు మహిళలు, ఏడుగురు వ్యక్తుల కు కలిపి మొత్తం 13 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్యు లు నిర్ధారించారు.   


కాప్రాసర్కిల్‌లో ఎనిమిది మందికి... 

కాప్రాసర్కిల్‌ పరిధిలో ఎనిమిది మందికి కరోనా సోకింది. కాప్రా సాకేత్‌ కాలనీలో ఒకరు, ఏఎ్‌సరావునగర్‌ భవానీనగర్‌లో ఒకరు, పరిమళానగర్‌లో ఒకరు, హెచ్‌బీకాలనీలో ఒకరు, నాచారంలో ఇద్దరు, మల్లాపూర్‌లో ఇద్దరు   వైరస్‌ బారినపడ్డారు. దీంతో సర్కిల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 224కు చేరింది.  


శేరిలింగంపల్లిలో 51 మందికి పాజిటివ్‌

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 51 పాజిటివ్‌ కేసులొచ్చాయి. శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో-5, హఫీజ్‌పేట పట్టణ ఆరోగ్యకేంద్రంలో -11, రాయదుర్గం ఆరోగ్యకేంద్రంలో-4,  కొండాపూర్‌ జిల్లా ఆస్పత్రిలో- 31 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దశరథ్‌ తెలిపారు. 


ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌లలో..

ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌ పరిధిలో 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముషీరాబాద్‌ యూపీహెచ్‌సీలో 24 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి, భోలక్‌పూర్‌ యూపీహెచ్‌సీలో 9 మందికి కరోనా పాజిటి వ్‌ వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. అలాగే, ఈ రెండు ప్రాంతాల్లో వివిధ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకోగా, 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు భోలక్‌ఫూర్‌ యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ కృష్ణమోహన్‌ తెలిపారు. 


81 మందికి పాజిటివ్‌... 

ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌ సర్కిళ్లలో మొత్తం 81 మందికి  పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. హయత్‌నగర్‌ సర్కిల్‌ పరిధి బీఎన్‌రెడ్డినగర్‌లో బాలిక, యువకుడు, హయత్‌నగర్‌లో మహిళ, వ్యక్తి,  చంద్రపురికాలనీలో పురుషుడు, వనస్థలిపురంలో ఇద్దరు పురుషులు, క్రిస్టియన్‌ కాలనీలో మహిళ, ఆదర్శ్‌నగర్‌లో వ్యక్తి, హరిహరపురంలో వ్యక్తి, ఎన్‌జీవోస్‌ కాలనీలో వ్యక్తి, యువకుడు, నాగోల్‌లో వ్యక్తి, సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధి శ్రీని వాసకాలనీలో మహిళ, పీఅండ్‌టీకాలనీలో మహిళ, శారదానగర్‌లో వ్యక్తి, న్యూమారుతీనగర్‌లో ఇద్దరు వ్యక్తులు, మార్గదర్శికాలనీలో బాలిక, స్నేహపురి కాలనీలో వ్యక్తి, బాలిక, బాలుడు, ఆర్‌కేపురంలో వ్యక్తి, చైతన్యపురిలో వృద్ధుడు, మహిళ, హుడాకాలనీలో వ్యక్తి, ఓల్డ్‌ మారుతీనగర్‌లో వ్యక్తి, విద్యుత్‌నగర్‌లో వృద్ధుడు, లక్ష్మీనగర్‌లో వ్యక్తి, వాసవీకాలనీలో యువకుడు, కమలానగర్‌లో మహిళ, దిల్‌సుఖ్‌నగర్‌లో ఇద్దరు మహిళలు, వ్యక్తి, వృద్ధుడు, నేతా జీనగర్‌లో వృద్ధుడు, భవానీనగర్‌లో మహిళ, వ్యక్తి, మారుతీనగర్‌లో యువకుడు, వ్యక్తి, టెలిఫోన్‌కాలనీలో వ్యక్తి, సరూర్‌నగర్‌ వెంకటేశ్వరకాలనీలో వ్యక్తి, కొత్తపేటలో వ్యక్తి, ద్వారకాపురంలో వ్యక్తి, ఎన్‌టీఆర్‌నగర్‌లో యువతి, వ్యక్తి, వివేకానందనగర్‌లో యువతి, గడ్డిఅన్నారంలో బాలిక, ఎల్‌బీనగర్‌ సర్కిల్‌ పరిధి నవోదయకాలనీలో ఇద్దరు వృద్ధులు, ఎల్‌బీనగర్‌లో ఇద్దరు వ్యక్తులు  యువతి, యవకుడు, చంపాపేటలో మహిళ, యువకుడు, మహిళ, నందన వనంకాలనీలో ముగ్గురు వ్యక్తులు, లింగోజిగూడలో యువకుడు, వ్యక్తి, టీవీ కాలనీలో యువకుడు, వ్యక్తి, వెంకటేశ్వరకాలనీలో వ్యక్తి, ధాతునగర్‌లో మహిళ, కర్మన్‌ఘాట్‌ న్యూమారుతీనగర్‌లో వ్యక్తి, ఎల్‌బీనగర్‌లో యువతి, వ్యక్తి, కర్మన్‌ఘాట్‌లో వ్యక్తి, సుష్మాసాయినగర్‌ కాలనీలో యువతి, చంపాపేటలో బా లుడు, మారుతీనగర్‌లో యువకుడు, దర్గాభవానీనగర్‌లో యువతి, ఏపీఎస్‌ ఈబీకాలనీలో వ్యక్తి, క్రాంతినగర్‌లో వృద్ధుడు, శ్రీరాంనగర్‌లో వ్యక్తి, అభ్యుదయనగర్‌లో వ్యక్తి, కర్మన్‌ఘాట్‌లో వ్యక్తి,ఎల్‌బీనగర్‌లో మహిళ, చంపాపేటలో వ్యక్తి కరోనా బారిన పడ్డారు.


మలక్‌పేటలో 44  

మలక్‌పేట సర్కిల్‌-6 పరిధిలో 44మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. సైదాబాద్‌లో ఎనిమిది మందికి, పూసలబస్తీలో ఒకరికి, చంచల్‌గూ డలో నలుగురికి, న్యూమలక్‌పేటలో ఇద్దరికి, ముసారాంబాగ్‌లో ఒకరికి, ఓల్డ్‌మలక్‌పేటలో ఒకరికి, సలీంనగర్‌లో ఇద్దరికి, శ్రీపురంకాలనీలో ఇద్దరికి, మ లక్‌పేటలో ఇద్దరికి, అక్బర్‌బాగ్‌లో ముగ్గురికి, తిరుమలహిల్స్‌లో ఒకరికి, మూ సానగర్‌లో ఒకరికి, ఆజంపురలో ఒకరికి, చాదర్‌ఘాట్‌లోని జేవీబీ టెంపుల్‌ లేన్‌లో ఇద్దరికి, సంతో్‌షనగర్‌లో ఏడుగురికి, మాదన్నపేట భానునగర్‌లో ఇద్దరికి, ఎంబీహట్స్‌లో ఒకరికి, సలావుద్దీన్‌నగర్‌లో ఒకరికి, ఆర్‌సీనగర్‌లో  ఒకరికి, సింగరేణి కాలనీలో ఒకరికి కరోనా సోకినట్లు బయటపడింది. 


పెద్దఅంబర్‌పేట్‌లో

పెద్దఅంబర్‌పేట్‌ మున్సిపాలిటీ పరిధిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. కళానగర్‌లో ఒకే ఇంట్లో మహిళకు, యువకుడికి పాజిటివ్‌గా తెలింది. తట్టిఅన్నారంలో మరొకరికి పాజిటివ్‌ వచ్చింది. 


యూసు్‌ఫగూడ సర్కిల్‌లో.. 

యూసు్‌ఫగూడ సర్కిల్‌-19 పరిధిలో 24 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. యూసు్‌ఫగూడ డివిజన్‌లో 11, బోరబండ డివిజన్‌లో 2, ఎర్రగడ్డ డివిజన్‌లో 6, రహ్మత్‌నగర్‌ డివిజన్‌లో 4, వెంగళరావునగర్‌ డివిజన్‌లో 1 మొత్తం 24 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  


ఫీవర్‌కు 438 మంది అనుమానితులు  

నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రికి 438 మంది కరోనా అనుమానితులొచ్చారు. వారిలో 38 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎర్రగడ్డలోని చెస్ట్‌ ఆస్పత్రిలో ఏడు పాజిటివ్‌ కేసులను చికిత్స అందిస్తున్నారు. 84 మంది అను మానితులను కలుపుకుని 91 మందికి వైద్యమందిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ తెలిపారు. ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆస్పత్రి 105 మందికి చికిత్సను అందిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పరమేశ్వర్‌ నాయక్‌ తెలిపారు.  


సరోజినీలో.. 

మెహిదీపట్నం సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో 243 మందికి పరీక్షలు నిర్వహించగా, 42మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ఇన్‌చార్జి డాక్టర్‌ అనురాధ తెలిపారు.  


యునానీ ఆస్పత్రిలో..

చార్మినార్‌ యునానీ టిబ్బి ఆస్పత్రిలో 264 మందికి పరీక్షలు నిర్వహించారు. 


బాగ్‌అంబర్‌పేటలో..

బాగ్‌అంబర్‌పేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకోవడానికి గత మూడు రోజులుగా ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చినప్పటికీ ఆయా వ్యక్తులు నివసించే ప్రాంతాల్లో సోడియం క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయడంలేదని,  ఆ ప్రాంతాన్ని కట్టడి చేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ ప్రాంతంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు అధికంగా ఉన్నారని శానిటైజ్‌ చేయాలని పలుమార్లు జీహెచ్‌ఎంసీ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. 


బోయినపల్లి ఠాణాకు కరోనా భయం..హోం క్వారంటైన్‌లో 13 మంది సిబ్బంది..?

బోయినపల్లి ఠాణా కరోనాతో బోసి పోయింది. లాక్‌డౌన్‌ సమయంలో పకడ్బందీగా విధులు నిర్వర్తించడంతోపా టు తమ వేతనాల నుంచి పేదల ఆకలి తీర్చిన పోలీసులను నేడు కరోనా భ యం వెంటాడుతోంది. ఈ ఠాణాలో పనిచేస్తున్న 13 మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు మహిళా సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. ఠాణాకు చెందిన ఓ ఉన్నతాధికారికి ఇటీవల పాజిటివ్‌ రాగా, ఆయన కరోనా ను జయించినట్లు తెలిసింది. ఈ ఠాణాలో 52 మంది విధులు నిర్వర్తిస్తుండగా, 13 మంది పాజిటివ్‌ బారినపడి హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇందులో ఎస్సైలు కూడా ఉన్నారు. 


రాజేంద్రనగర్‌ సర్కిల్లో ఇప్పటివరకు 791మందికి పాజిటివ్‌ 

రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో శుక్రవారం నాటికి సుమారు 791 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారిక  లెక్కల ప్రకారం తెలుస్తోంది. వీరితోపాటు ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో పరీక్షలు చేసుకున్న వారు మరికొంత మంది ఉండే అవకాశం ఉంది. వివిధ ఆస్పత్రుల నుంచి రాజేంద్రనగర్‌ సర్కిల్‌కు వచ్చిన నివేదిక ప్రకారం, సర్కిల్‌ పరిధిలోని శివరాంపల్లి, మైలార్‌దేవుపల్లి, హసన్‌నగర్‌లలోని అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో చేస్తున్న ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలను కలుపుకుని ఇప్పటి వరకు 791 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారిలో 260 మంది గతంలో వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ కాగా, పది మంది వరకు మరణించారు. ప్రస్తుతం 521 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కాగా అత్తాపూర్‌ డివిజన్‌లో అత్యధికంగా 250 మందికిపైగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో గ్రేటర్‌లో రాజేంద్రనగర్‌ సర్కిల్‌ కూడా హైరిస్క్‌ సర్కిల్‌గా గుర్తించారు. 

Updated Date - 2020-07-18T09:41:14+05:30 IST