యోగాతో రోగనిరోధక శక్తి
ABN , First Publish Date - 2020-06-22T09:58:28+05:30 IST
యోగాతో రోగనిరోధక శక్తి పెంపొందుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
మంగళ్‌హాట్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): యోగాతో రోగనిరోధక శక్తి పెంపొందుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తే ఎలాంటి వ్యాఽధులు రావన్నారు. కార్యక్రమంలో గన్‌ఫౌండ్రీ యువ అసోసియేషన్ అధ్యక్షుడు ఓంప్రకాశ్ బీశ్వా, లంకాల దీపక్‌రెడ్డి పాల్గొన్నారు.
గోల్నాక: అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ కాలేరు పద్మ, టీఆర్ ఎస్ నాయకులు బి.లింగంగౌడ్, వై.బుచ్చిరెడ్డి తదితరులతో కలిసి హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలో యోగాసనాలు వేశారు. వీరన్నగుట్ట శివాలయం ప్రాంగణంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు భీమనబోయిన నర్సింగ్‌రావుయాదవ్, పార్టీ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ చింతల శ్రీనివా్‌సముదిరాజ్, బీజేవైఎం నగర ఉపాధ్యక్షుడు రవీందర్‌గౌడ్‌తో యోగా గురువు కుశాల్ యోగాసనాలు వేయించారు. బాగ్‌అంబర్‌పేటలోని తన నివాసంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఏడెల్లి అజయ్‌కుమార్ యోగా చేశారు.
కూకట్‌పల్లి: కూకట్‌పల్లిలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మాధవరం కాంతారావు పాల్గొన్నారు.
కుషాయిగూడ: ఎన్‌ఎ్‌ఫసీ సిబ్బంది కోసం నిర్వహించిన యోగా ప్రచార కార్యక్రమం ముగింపు వేడుకలు వీడియో కా న్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ దినేష్ శ్రీవాస్తవ, యోగా గురువు ఏఎల్వీ కుమార్‌రెడ్డి మాట్లాడారు.
రామంతాపూర్: నెహ్రూనగర్ కమ్యూనిటీ హాల్‌లో యోగా మాస్టర్ బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్ జ్యోత్స్ననాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
అల్వాల్: అల్వాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతిశ్రీనివా్‌సరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో యోగాచార్య నారాయణ, గోపీనాథ్, శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.
జవహర్‌నగర్: తైక్వాండో మాస్టర్, యోగా శిక్షకుడు రమేశ్ సిటిజన్స్, చిన్నారులతో యోగాసనాలు వేయించారు. కొండల్‌రెడ్డి, నారాయణ, శ్రీనివాస్, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.
మియాపూర్: చందానగర్‌లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానికులతోపాటు బీజేపీ రాష్ట్ర నాయకుడు జ్ఞానేంద్రప్రసాద్ యోగాసనాలు వేశారు.
నార్సింగ్: కోకాపేట్ కమ్యూనిటీహాల్లో జరిగిన కార్యక్రమంలో యోగా గురువు పి.ఎ్‌స.మల్లారెడ్డి, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు నాగేష్, నాయకులు భిక్షపతి, జంగారెడ్డి, మల్లేష్ పాల్గొన్నారు.
మెహిదీపట్నం: సంతో్‌షనగర్ యోగా కేంద్రం, భారతీయ యోగా సంస్థాన్ ఆధ్వర్యంలో మెహిదీపట్నంలోని అంబాగార్డెన్ కమ్యూనిటీహాల్, పుల్లారెడ్డి పాఠశాల ఆవరణలో యోగా దినోత్సవం నిర్వహించారు.
అఫ్జల్‌గంజ్: యోగా భారతదేశానికి పుట్టినిల్లు లాంటిదని విశ్వహిందూ పరిషత్ ప్రఖండ్ ప్రముఖ్ ఎన్.ఆర్.లక్ష్మణ్ అన్నారు. గౌలిగూడలో ఆయన మాట్లాడారు.
కవాడిగూడ: ట్యాంక్‌బండ్‌పై ప్రతి రోజూ భారతీయ యోగా సంస్థాన్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్న యోగా గురువు విఠల్‌ను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఎన్.చారి, ముషీరాబాద్ కన్వీనర్ ఎం.రమే్‌షరాం, రాష్ట్ర నాయకులు పరిమళ్‌కుమార్, డివిజన్ అధ్యక్షుడు ఎం.సి.మహేంద్‌బాబు, యువమోర్చా నాయకుడు అనిల్ సన్మానించారు.
చిక్కడపల్లి: గాంధీనగర్ డివిజన్‌లోని జనప్రియ అబోడ్స్ అపార్ట్‌మెంట్‌లో యోగాసనాలు వేశారు. బీజేవైఎం నగర అధ్యక్షుడు వినయ్‌కుమార్ పాల్గొన్నారు.
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి ఉప్పర్‌పల్లిలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బొక్క బాల్‌రెడ్డి, హైదర్‌గూడలో మహిళా మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు కె.ఉమామహేశ్వరీ యోగా చేశారు. ఉద్యాన కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సూరం సింధూజ మాట్లాడారు. బి.జీవన్‌కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ డి.లక్ష్మీనారాయణ, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
సైదాబాద్: యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని జైళ్ల శాఖ ఐజీ బి.సైదయ్య అన్నారు. చంచల్‌గూడలోని జైళ్ల శాఖ సీకా గ్రౌండ్‌లో ట్రైనీ వార్డర్లకు నిర్వహించిన యోగా తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జైళ్లశాఖ డీఐజీ ఎం.ఆర్.భాస్కర్, సీకా ప్రిన్సిపాల్ శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు. చంచల్‌గూడ మహిళా జైలులో సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి యోగాసనాలు వేయించారు.
హైదరాబాద్ సిటీ: ఇప్లూ వర్సిటీలో ఆన్‌లైన్‌లో యోగా నిర్వహించారు. యోగా ట్రైనర్ డాక్టర్ వెంకటరాజయ్య ఆసనాలు వేస్తుండగా వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఈ.సురే్‌షకుమార్‌తో పాటు అధ్యాపకులు, అనుబంధ కాలేజీలకు చెందిన అధ్యాపకులు ఆసనాలను వేశారు.