అపార్ట్మెంట్కు అక్రమ నల్లా కనెక్షన్
ABN , First Publish Date - 2020-09-30T09:23:44+05:30 IST
ఓ అపార్ట్మెంట్కు ఉన్న నల్లా కనెక్షన్ను 2012లో తొలగించినా, మళ్లీ అక్రమంగా కనెక్షన్ ..
20మందిపై వాటర్బోర్డు క్రిమినల్ కేసు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): ఓ అపార్ట్మెంట్కు ఉన్న నల్లా కనెక్షన్ను 2012లో తొలగించినా, మళ్లీ అక్రమంగా కనెక్షన్ తీసుకున్నారు. దీనిని గుర్తించిన వాటర్బోర్డు విజిలెన్స్ అధికారులు అపార్ట్మెంట్లో ఉండే 20 మందిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. డబీర్పురా, నూర్ఖాన్బజార్లోని మెట్రో క్లాసిక్ అపార్ట్మెంట్కు అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకొని నీటి చౌర్యం చేస్తున్నారు. దీంతో ఎండీ ఆదేశాల మేరకు వాటర్బోర్డు విజిలెన్స్ అధికారులు అక్రమ నల్లా కనెక్షన్ తొలగించడంతో పాటు సంబంధిత భవన యజమాని మహమ్మద్ థాకీ, ఇతర అపార్ట్మెంట్ యజమానులైన 19 మంది మొత్తం 20 మందిపై డబీర్పురా పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.