ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ డీజీ బంగ్లాకు ఐజీబీసీ సర్టిఫికే షన్‌

ABN , First Publish Date - 2020-05-29T09:26:36+05:30 IST

సిమెంట్‌, స్టీల్‌, కంకర లాంటి వస్తువుల వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత వస్తువులతో నిర్మించిన

ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ డీజీ బంగ్లాకు ఐజీబీసీ సర్టిఫికే షన్‌

రాజేంద్రనగర్‌, మే 28(ఆంధ్రజ్యోతి): సిమెంట్‌, స్టీల్‌, కంకర లాంటి వస్తువుల వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత వస్తువులతో నిర్మించిన రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్‌ సంస్థ(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బంగ్లాకు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ సర్టిఫికేషన్‌ (ఐజీబీసీ) లభించింది. ఈ బంగ్లాలో రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌, వేస్ట్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ అండ్‌ రీసైక్లింగ్‌, సోలార్‌ ఎనర్జీ హార్వెస్టింగ్‌ లాంటి సదుపాయాలను కల్పించారు.

Updated Date - 2020-05-29T09:26:36+05:30 IST