ఐదే నిమిషాలు దాటితే... జరిమానా..

ABN , First Publish Date - 2020-07-18T09:54:28+05:30 IST

ఐదు నిమిషాల నిబంధనతో క్యాబ్‌ డ్రైవర్లను నిలువునా దోచుకుంటున్నారు. ప్రయాణికులను దించడానికి శంషాబాద్‌

ఐదే నిమిషాలు దాటితే... జరిమానా..

ఎయిర్‌పోర్టు... సికింద్రాబాద్‌ రేల్వేస్టేషన్లలో కొత్త నిబంధన


హైదరాబాద్‌ జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఐదు నిమిషాల నిబంధనతో క్యాబ్‌ డ్రైవర్లను నిలువునా దోచుకుంటున్నారు. ప్రయాణికులను దించడానికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని ర్యాంపు ఎక్కితే చాలు, ఐదు నిమిషాల్లో వచ్చేయాలి. లేదంటే ఆటో మేటిగ్గా రూ.100 జరిమానా చెల్లించాల్సిందే. ఇదే పరిస్థితి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఉందని క్యాబ్‌ డ్రైవర్లు లబోదిబో మంటున్నారు. ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్‌లకు వెళ్లే ప్రయాణికులు క్యాబ్‌లోంచి సామాగ్రిని దించుకుకోవడం, తమ వస్తువులను తనిఖీ చేసుకోవడం, బిల్లు చెల్లించడానికి 5-10 నిమిషాల సమయం పడుతుంది.


కానీ ఎయిర్‌పోర్టు అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా ర్యాంప్‌ పైకి ఎంట్రీ అయిన సమయాన్ని పరిగణలోకి తీసుకొని, 5 నిమిషాలు దాటితే ఎగ్జిట్‌ గేటు వద్ద ఆలస్యానికి రూ.100ల వసూలు చేయడంతో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గుర వుతున్నారని తెలంగాణ రాష్ట్ర ట్యాక్సీ అండ్‌ డ్రైవర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ అధ్యక్షుడు షేక్‌ సల్లావుద్దీన్‌ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం 5 నిమిషాల నిబందనలో మార్పులు తీసుకురావాలని క్యాబ్‌ డ్రైవర్లు కోరుతున్నారు.

Updated Date - 2020-07-18T09:54:28+05:30 IST