ఐకాన్‌ ఆఫ్‌ ది ఈయర్‌ - 2020 అవార్డ్‌ల ప్రదానం

ABN , First Publish Date - 2020-12-28T06:12:51+05:30 IST

సృజన ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఐకాన్‌ ఆఫ్‌ ది ఈయర్‌ - 2020 అవార్డ్‌లను ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారికి ఈ అవార్డులను అందజేశారు.

ఐకాన్‌ ఆఫ్‌ ది ఈయర్‌ - 2020 అవార్డ్‌ల ప్రదానం

(బర్కత్‌పుర - ఆంధ్రజ్యోతి): సృజన ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఐకాన్‌ ఆఫ్‌ ది ఈయర్‌ - 2020 అవార్డ్‌లను ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారికి ఈ అవార్డులను అందజేశారు. కేంద్ర మాజీమంత్రి డాక్టర్‌ సముద్రాల వేణుగోపాలచారి, మల్కాజ్‌గిరి జిల్లా జడ్జి జస్టిస్‌ బూర్గుల మధుసూదన్‌, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఆర్యన్‌ అధ్యక్షుడు సీహెచ్‌.రాజశేఖర్‌రెడ్డి, ఆర్టిస్టు బ్రహ్మయ్యచారి, హ్యూమన్‌ రైట్స్‌ ఇంటర్నేషనల్‌ కార్యదర్శి డాక్టర్‌ కె.ఆర్‌.పద్మారావు, సోషల్‌ వర్కర్‌ డాక్టర్‌ కె.వి.బి.వసంతరాయలు హాజరై ఈ అవార్డులను అందజేశారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న కె.మంజులారెడ్డి, కె.విజయగోపాల్‌, టి.ఆంజనేయులు, డాక్టర్‌ ఎన్‌.రవికుమార్‌, డాక్టర్‌ వెంకటరమణ, మహయ్యరాజ్‌, ఎస్‌.నాగమల్లేశ్వర్‌రావు, పి.శశిధర్‌గౌడ్‌, టి.హనుమే్‌షచారి, కె.కె.రాజు, ఎం.అనురాధదాస్‌, కె.ప్రసన్నజోషి తదితరులకు ఐకాన్‌ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి ఎం.రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T06:12:51+05:30 IST