‘జీహెచ్‌ఎంసీ అధికారుల తప్పుడు నిర్ణయంపై హైకోర్టుకు వెళతా.. ’

ABN , First Publish Date - 2020-12-07T19:38:01+05:30 IST

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ 15 అధికారులు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న రాంనగర్‌ డివిజన్‌లోని ఐదు పోలింగ్‌ స్టేషన్లు, అందులోని 5,500 ఓట్లను ముషీరాబాద్‌ డివిజన్‌లో కలుపుతూ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయిస్తానని, ఈ అంశాన్ని పార్టీ అధిష్ఠానానికి కూడా ఫిర్యాదుచేస్తానని రాంనగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు.

‘జీహెచ్‌ఎంసీ అధికారుల తప్పుడు నిర్ణయంపై హైకోర్టుకు వెళతా.. ’

అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తా

రాంనగర్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి 


రాంనగర్‌/కవాడిగూడ, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ 15 అధికారులు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న రాంనగర్‌ డివిజన్‌లోని ఐదు పోలింగ్‌ స్టేషన్లు, అందులోని 5,500 ఓట్లను ముషీరాబాద్‌ డివిజన్‌లో కలుపుతూ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయిస్తానని, ఈ అంశాన్ని పార్టీ అధిష్ఠానానికి కూడా ఫిర్యాదుచేస్తానని రాంనగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. అంబేడ్కర్‌ వర్ధంతి సంద ర్భంగా లోయర్‌ట్యాంక్‌బండ్‌ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. తాను కార్పొరేటర్‌గా ఐదు సంవత్సరాల పాటు అభివృద్ధి పనులుచేసిన మేధరబస్తీ, శాస్ర్తినగర్‌, జెమిని కాలనీ, విజయభారతి స్కూల్‌ ఏరియా, ఓలిట్రీనిటిస్కూల్‌ లేన్‌ ప్రాంతాలను తనకు ఎలాంటి సమచారం ఇవ్వకుండా అధికారులు ఆ బస్తీలను ముషీరాబాద్‌ డివిజన్‌లో కలిపారని అన్నారు. గత ఎన్నికల్లో ఈ బస్తీల ఓటర్లందరూ తనకే ఓటర్లుగాఉన్నారని ఈ సారి మాత్రం అధికారులు ఎందుకు అలా చేశారో అర్థం కావడం లేదన్నారు. డీ లిమిటేషన్‌ లేనప్పటికీ అధికారులు ఒక రాంనగర్‌ డివిజన్‌లోనే మార్పులు చేయడం అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అధికారులు చేసిన తప్పిదం వల్లే తాను 528 స్వల్ప ఓట్లతో ఓటమి చెందానని వి.శ్రీనివా్‌సరెడ్డి తె లిపారు. ఏది ఏమైనా ప్రజాతీర్పును శిరసావహిస్తానని, ఓటమితో నిరాశ చెందకుండా డివిజన్‌లో పార్టీపటిష్టతకోసం అంకితభావంతో పనిచేస్తానని అన్నారు. 


స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను త్వరలో క్రీడాకారులకు అందజేస్తాం: బీజేపీ తాజా కార్పొరేటర్‌ సుప్రియానవీన్‌గౌడ్‌

ముషీరాబాద్‌: ముషీరాబాద్‌ డివిజన్‌ ఎంసీహెచ్‌ కాలనీలోని మినీస్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను త్వరలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామని డివిజన్‌ బీజేపీ తాజా కార్పొరేటర్‌ ఎం.సుప్రియానవీన్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం ఎంసీహెచ్‌ కాలనీలోని మినీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ క్రీడాకారులు కార్పొరేటర్‌గా విజయం సాధించిన సుప్రియానవీన్‌గౌడ్‌ను స్పోర్ట్స్‌ భవనానికి ఆహ్వానించారు. కార్పొరేటర్‌ దంపతులను క్రీడాకారులు సత్కరించారు. 


ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం: వల్లారపు

బౌద్ధనగర్‌: గ్రేటర్‌ జీహెచ్‌ఏంసీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని టీడీపీ సికింద్రాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వల్లారపు శ్రీనివాస్‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతంతో ప్రజలోకి వెళ్లి వారి సమస్యలపై పోరాడతామన్నారు.


ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా : పాండుయాదవ్‌

బోయిన్‌పల్లి: కంటోన్మెంట్‌ బోర్డు ఆరవ వార్డు పరిధిలోని సంతోష్‌పురికాలనీలో 5 లక్షల బోర్డు నిధులతో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పైపులైన్‌ నిర్మాణ పనులను ఆదివారం స్థానికులతో కలిసి బోర్డు సభ్యుడు పాండుయాదవ్‌, విద్యావతిలు ప్రారంభించారు. కార్యక్రమంలో నారాయణ, శ్రీకాంత్‌, మహేందర్‌, శివకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-07T19:38:01+05:30 IST