గంజాయి నూనె అమ్ముతూ పట్టుబడ్డ విద్యార్థులు

ABN , First Publish Date - 2020-12-11T16:28:54+05:30 IST

గంజాయి నూనెను అమ్ముతున్న ఇద్దరు విద్యార్థులను కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.

గంజాయి నూనె అమ్ముతూ పట్టుబడ్డ విద్యార్థులు

హైదరాబాద్: గంజాయి నూనెను అమ్ముతున్న ఇద్దరు విద్యార్థులను కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. సాయిగిరీశ్ (21), షేక్ సోహల్(21) అనే ఇద్దరు విద్యార్థులు గంజాయితో తీసిన హషీష్  నూనెను అమ్ముతున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పద్మా రావు  నగర్ ఫేజ్‌‌-2 రింగ్ రోడ్ వద్ద  గంజాయి నూనె అమ్ముతుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు సాయిగిరీశ్ డిగ్రీ సెంకడ్ ఇయిర్, షేక్ సోహల్ డిప్లొమా చేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల వద్ద నుంచి  240 గ్రాముల నూనెను స్వాధీనం చేసుకున్న కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2020-12-11T16:28:54+05:30 IST