బయటికొచ్చిన టెకీ శ్వేత ఆడియో టేపులు

ABN , First Publish Date - 2020-10-14T00:37:48+05:30 IST

ప్రియుడు మోసం చేశాడని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ శ్వేత ట్రైన్‌కు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపిన విషయం తెలిసిందే.

బయటికొచ్చిన టెకీ శ్వేత ఆడియో టేపులు

హైదరాబాద్‌ : ప్రియుడు మోసం చేశాడని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ శ్వేత ట్రైన్‌కు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గంటకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. శ్వేత ఆత్మహత్య చేసుకోలేదని.. అజయ్‌ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా టెకీ శ్వేత ఆడియో టేపులు బయటికొచ్చాయి.


ఆడియో టేపుల్లో ఏముంది..!?

ఈ టేపులో అజయ్‌ తల్లి, సోదరితో ఫోన్‌లో శ్వేత  మాట్లాడినట్లు ఉంది. సోషల్‌ మీడియాలో తన ఫోటోలను అప్‌లోడ్‌ చేసి వేధిస్తున్నాడని అజయ్ కుటుంబీకులకు శ్వేత ఫోన్లో చెప్పింది. తన ఫోటోలు తీయమని చెబుతున్నా వాటిని తీయడం లేదని ఫోన్లో శ్వేత ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగైనా వాటిని తొలగించేలా చూడాలని అజయ్ తల్లి, సోదరి ఇద్దరినీ శ్వేత బతిమాలినట్లు ఆడియో టేపుల్లో ఉంది.


శ్వేత తల్లిదండ్రులు ఇలా..!

ప్రేమ, పెళ్లి పేరుతో శ్వేతను మోసం చేశాడని.. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని శ్వేత పేరెంట్స్ చెబుతున్నారు. శ్వేతను అజయ్ ప్రేమ పేరిట బ్లాక్ మెయిల్ చేశాడని.. వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశాడని వారు మీడియాకు వెల్లడించారు. ఆ అవమానం తట్టుకోలేక శ్వేత డిప్రెషన్‌కు లోనైందని పేరెంట్స్ అంటున్నారు. మరోవైపు.. శ్వేతది ఆత్మహత్య? హత్య? అనే కోణంలో పోలీసుల విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే నిందితుడు అజయ్‌ను అరెస్ట్ చేసిన మేడిపల్లి పోలీసులు విచారిస్తున్నారు. అయితే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం చేశారన్న శ్వేత తల్లిదండ్రుల ఆరోపణలపై ఇంతవరకూ ఖాకీలు స్పందించలేదు.

Updated Date - 2020-10-14T00:37:48+05:30 IST