సీజ్‌ చేసిన వాహనాలు వాపస్‌

ABN , First Publish Date - 2020-05-10T14:19:34+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీకాలనీ పోలీ‌స్‌స్టేషన్ల

సీజ్‌ చేసిన వాహనాలు వాపస్‌

హైదరాబాద్/కూకట్‌పల్లి: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీకాలనీ పోలీ‌స్‌స్టేషన్ల పరిధిలో సీజ్‌ చేసిన వాహనాలను శనివారం యజమానులకు అప్పగించారు. కేపీహెచ్‌బీ పీఎస్‌ పరిధిలో 650 వాహనాలను సీజ్‌ చేయగా ఇప్పటివరకు 160 వాహనాలను యజమానులకు అప్పగించారు. డీజీపీ, సీపీ ఆదేశాల మేరకు వాహన యజమానుల నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీ, ఆధార్‌కార్డు, సెల్ఫ్‌ అసెః‌స్‌మెంట్‌ బాండ్‌ తీసుకొని వాహనాలను రిలీజ్‌ చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ ఉల్లంఘనుల చలాన్లను సైతం వసూలు చేస్తున్నారు. కోర్టులు తెరుచుకొన్న తర్వాత జరిమానా చెల్లించే విధంగా వాహనదారుల నుంచి బాండ్లు తీసుకుంటున్నారు. 


రాజేంద్రనగర్‌ పరిధిలో..

రాజేంద్రనగర్‌, మైలార్‌దేవుపల్లి, మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో సీజ్‌ చేసిన 6వేల వాహనాలను వాటి యజమానులకు అప్పగిస్తున్నామని ఏసీపీ కె.అశోక్‌ చక్రవర్తి తెలిపారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని శివరాంపల్లి ఎస్‌ఎన్‌సీ కన్వెన్షన్‌, ఆరాంఘర్‌లోని మెట్రో క్లాసిక్‌ గార్డెన్‌తో పాటు హిమాయత్‌సాగర్‌ లేక్‌ పోలీస్‌ స్టేషన్‌, మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో శనివారం నుంచి వాహనాలను వాటి యజమానులకు ఇస్తున్నామని తెలిపారు.


గాంధీనగర్‌ పీఎస్‌ పరిధిలో..

గాంధీనగర్‌ పీఎస్‌ పరిధిలో 850 ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశామని ఇన్‌స్పెక్టర్‌ సుంకరి శ్రీనివాస్‌రావు తెలిపారు. శనివారం సాయంత్రం వరకు 49 ద్విచక్రవాహనాలను వాహన యజమానులకు అందజేసినట్లు తెలిపారు.


నార్సింగ్‌ పీఎస్‌ పరిధిలో..

నార్సింగ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో 50 వాహనాలను యజమానులకు అప్పగించారు. 

Updated Date - 2020-05-10T14:19:34+05:30 IST