గృహిణి సెల్ఫీ వీడియో.. కన్నపిల్లల ముందే ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-06T19:32:20+05:30 IST

నగరంలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుని ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. కన్నపిల్లల ముందే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని లాలాపేట్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..

గృహిణి సెల్ఫీ వీడియో.. కన్నపిల్లల ముందే ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుని ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. కన్నపిల్లల ముందే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని లాలాపేట్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. లాలాపేట్‌లో నివసించే మంజులకు 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు కుమారులు. రంజీత్ ఆరో తరగతి, తేజస్ ఐదో తరగతి చదువుతున్నారు. భర్త బేకరి వ్యాపారం చేస్తున్నాడు. లాలాపేట్ ప్రధాన రహదారిపై వీరికి అయ్యంగార్ బేకరీ ఉంది.  ఇదిలా ఉంటే.. ఆమె శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరేసుకుంది. ఆఖరు నిమిషంలో చూసిన చిన్నారులు... తల్లిని కాపాడే ప్రయత్నం చేశారు. తమ కళ్ల ముందే తల్లి చనిపోతున్నా కాపాడలేక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఇంటికి కొద్ది దూరంలోని తమ బేకరీలో ఉన్న తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. అయితే ఆయన వచ్చేలోగా ఆమె మృతి చెందింది. అమ్మా.. అమ్మా అంటూ చిన్నారులు ఏడుస్తూ కూర్చోవడం.. అక్కడున్న వారిని కలిచి వేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. Read more