కోవిడ్ పరీక్షల తర్వాతే ప్రచారం చేయాలంటూ హైకోర్టులో పిటిషన్
ABN , First Publish Date - 2020-11-21T23:37:08+05:30 IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కోవిడ్ పరీక్షల తర్వాతే ప్రచారం చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో న్యాయవాది రాపోలు భాస్కర్ రిట్ పిటిషన్ దాఖలు

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కోవిడ్ పరీక్షల తర్వాతే ప్రచారం చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో న్యాయవాది రాపోలు భాస్కర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులతో పాటు ప్రచారం చేసే వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని పిటిషనర్ కోరారు.