భారీ వర్షాలకు కూలిన ఇళ్లు...ఎనిమిది మంది మృతి

ABN , First Publish Date - 2020-10-14T12:23:00+05:30 IST

నగరంలో భారీ వర్షం విషాదాన్ని నింపింది. నిన్నటి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రెండు ఇళ్లు కూలిపోవడంతో దాదాపు ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.

భారీ వర్షాలకు కూలిన ఇళ్లు...ఎనిమిది మంది మృతి

హైదరాబాద్: నగరంలో భారీ వర్షం విషాదాన్ని నింపింది. నిన్నటి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రెండు ఇళ్లు కూలిపోవడంతో దాదాపు ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. పాతబస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాతబస్తీ చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గౌస్‌నగర్ ప్రాంతంలో వర్షం కారణంగా ఎత్తైన ప్రదేశం నుండి రాళ్లు వచ్చి క్రింద  ఉన్న ఇళ్ల గోడలపై పడడంతో రెండు ఇళ్ల గోడలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదు మంది మరణించారు. మరో నాలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఫలక్‌నుమా ఏసీపీ కూడా ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Updated Date - 2020-10-14T12:23:00+05:30 IST