హైదరాబాద్‌‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో దారుణం

ABN , First Publish Date - 2020-10-13T21:53:23+05:30 IST

హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో దారుణం చోటుచేసుకుంది.

హైదరాబాద్‌‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో దారుణం

హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో దారుణం చోటుచేసుకుంది. ముంబై నుంచి వచ్చిన ఓ యువతిపై మద్యం సేవించి యువకుడు బలత్కారం చేశాడు. ఆ కామాంధుడికి మరో ఇద్దరు యువతులు సహకరించారు. యువతి న్యూడ్ ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై యువతి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును బంజారాహిల్స్ పోలీసులకు ముంబై పోలీసులు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఫిర్యాదులో జుబేర్, స్వీటీ, ప్రజక్తలపై పేర్లను కూడా బాధితురాలు పేర్కొంది. 


బాధితురాలు బట్టలు మార్చుకునే సమయంలో ప్రజక్త వీడియోలు తీసింది. ఆ న్యూడ్ ఫొటోలు, వీడియోలు బాధితురాలి వాట్సాప్‌కు పంపి కేసును వాపస్ తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబై పోలీసులు బదిలీ చేసిన ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2020-10-13T21:53:23+05:30 IST