పంచాయతీ సిబ్బంది పాదయాత్ర వాయిదా

ABN , First Publish Date - 2020-03-16T10:10:38+05:30 IST

పంచాయతీ సిబ్బంది పాదయాత్ర వాయిదా

పంచాయతీ సిబ్బంది పాదయాత్ర వాయిదా


చిక్కడపల్లి, మార్చి15(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్య పరిరక్షణకోసమే పంచాయతీ సిబ్బంది పాదయాత్ర వాయిదా వేసినట్లు తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పాలడుగు భాస్కర్‌ తెలిపారు. ఈనెల 16నుంచి 20 వరకు అయిదు బృందాలుగా ‘పల్లెనుంచి పట్నం వరకు’ పేరిట హైదరాబాద్‌ వరకు పాదయాత్రలు నిర్వహించ తలపెట్టామన్నారు. అయితే కరోనా హెల్త్‌ ఎమర్జెన్సీ దృష్ట్యా ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు గ్రామపంచాయతీలలో నివసించే ప్రజలకు పారిశుధ్యం ఇతర సేవా కార్యక్రమాలు అందించేందుకు పాదయాత్రలను వాయిదా వేయాలని నిర్ణయించామన్నారు. 

Updated Date - 2020-03-16T10:10:38+05:30 IST