పొత్తూరి సంస్మరణ సభ వాయిదా

ABN , First Publish Date - 2020-03-16T10:10:20+05:30 IST

పొత్తూరి సంస్మరణ సభ వాయిదా

పొత్తూరి సంస్మరణ సభ వాయిదా

బర్కత్‌ఫుర, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : సీనియర్‌ పాత్రికేయులు, ప్రెస్‌అకాడమీ మాజీ చైర్మన్‌ పొత్తూరి వెంకటేశ్వర్‌రావు సంస్మరణ సభను వాయిదా వేసినట్లు టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరహత్‌ అలీ తెలిపారు. ఈ నెల 16న బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఈ సంస్మరణ సభ జరగాల్సి ఉందని, కరోనా వైరస్‌ను నివారించే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ సంస్మరణ సభను వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు. ఏప్రిల్‌ మొదటి వారంలో సంస్మరణ సభను నిర్వహించే విధంగా తగు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం సభలు సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశాలు జారీచేయడం వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 

Updated Date - 2020-03-16T10:10:20+05:30 IST