నియోజకవర్గానికో జూనియర్‌, డిగ్రీ కాలేజీ పెట్టాలి

ABN , First Publish Date - 2020-03-16T10:07:55+05:30 IST

నియోజకవర్గానికో జూనియర్‌, డిగ్రీ కాలేజీ పెట్టాలి

నియోజకవర్గానికో జూనియర్‌, డిగ్రీ కాలేజీ పెట్టాలి

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గానికో డిగ్రీ, జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని మజ్లిస్‌ ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్‌ కోరారు. అమ్మాయిలు పదో తరగతి పూర్తికాగానే సుదూరంలో ఉన్న కాలేజీలకు వెళ్లలేక చదువు మానేస్తున్నారని, తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం శాసనసభలో పద్దులపై చర్చలో ఆయన మాట్లాడారు. మైనారిటీల గురుకుల పాఠశాలల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తున్నదని ఆరోపించారు. బాలికల పాఠశాలల్లో మూత్రశాలలు కూడా లేవని, మౌలిక సదుపాయాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజులు ఖరారు చేయాలన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో విచ్చలవిడిగా దోపిడీని అరికట్టాలని కోరారు. సరోజనిదేవి కంటి ఆస్పత్రిని సూపర్‌స్పెషాలిటీ ఆస్పతిగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు.  

Updated Date - 2020-03-16T10:07:55+05:30 IST