ప్రైవేట్‌ వైద్యులు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు: రాజాసింగ్‌

ABN , First Publish Date - 2020-03-16T10:07:32+05:30 IST

ప్రైవేట్‌ వైద్యులు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు: రాజాసింగ్‌

ప్రైవేట్‌ వైద్యులు రాక్షసుల్లాగా  ప్రవర్తిస్తున్నారు: రాజాసింగ్‌

హైదరాబాద్‌, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల వైద్యులు రాక్షసుల్లాగా ప్రవరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. వైద్యుడిని దేవుడిగా భావించి ఆస్పత్రికి వచ్చిన రోగుల నుంచి లక్షల్లో డబ్బులు గుంజుతున్నారన్నారు. చనిపోయిన శవాలను రెండు మూడు రోజులు వెంటిలేటర్‌పై పెట్టి చికిత్స చేస్తున్నారని డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోయిన శవాలను ఉచితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించేలా చట్టం రూపొందించాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఎద్దులు, ఆవులు, బర్రెలను హైదరాబాద్‌లో కోసి.. ఆ మాంసాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని, ప్రభుత్వం ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-03-16T10:07:32+05:30 IST