డప్పు, చెప్పు వృత్తిదారులకు పెన్షన్‌పై అసెంబ్లీలో చర్చించాలి

ABN , First Publish Date - 2020-03-16T10:05:02+05:30 IST

డప్పు, చెప్పు వృత్తిదారులకు పెన్షన్‌పై అసెంబ్లీలో చర్చించాలి

డప్పు, చెప్పు వృత్తిదారులకు పెన్షన్‌పై అసెంబ్లీలో చర్చించాలి

మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వంగపల్లి శ్రీనివాస్‌ వినతి 


రాంనగర్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ‘డప్పు, చెప్పు వృత్తిదారులకు పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తామని టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీ అమలు కోసం అసెంబ్లీలో చర్చించాలి. పెన్షన్‌ అమలు కోసం నిర్ణయం తీసుకోవాలి’ అని టీఎ్‌స ఎమ్మార్సీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ కోరారు. ఆదివారం అసెం బ్లీ ఆవరణలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఆయన వినతి పత్రం సమర్పించిన అనంతరం మాట్లాడారు. డప్పు, చెప్పు వృత్తిదారులకు నెలకు రూ.2000 పెన్షన్‌ ఇస్తామన్న హామీని అమలు చేయాలని, సోమవారంతో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్న సందర్భంగా ఈ అంశంపై చర్చించి చట్టం చేయాలని కోరినట్లు చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఎమ్మార్పీఎస్‌ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు నందకిషోర్‌, ఎంఎ్‌సఎఫ్‌ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్‌ ఉన్నారు.  

Updated Date - 2020-03-16T10:05:02+05:30 IST