ఆన్‌లైన్ కాల్ మనీ కేసులో కొనసాగుతున్న విచారణ

ABN , First Publish Date - 2020-12-20T15:16:08+05:30 IST

ఆన్‌లైన్ కాల్ మనీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది.

ఆన్‌లైన్ కాల్ మనీ కేసులో కొనసాగుతున్న విచారణ

హైదరాబాద్: ఆన్‌లైన్ కాల్ మనీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మైక్రో ఫైనాన్స్ యాప్‌లను రూపొందించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు నెలల నుంచి యువకుడు యాప్‌ల ద్వారా రుణాలు ఇస్తున్నాడని... తీసుకున్న డబ్బుకు 50 శాతానికిపైగా వడ్డీ చెల్లించినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో యాప్‌లను కట్టడి చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాల్‌ మనీ యాప్‌లు నిషేధించాలని..కేంద్ర హోంశాఖ, ఐటీ శాఖలకు తెలంగాణ పోలీస్ శాఖ లేఖ రాసింది. 

Updated Date - 2020-12-20T15:16:08+05:30 IST