పాతబస్తీలో దారుణం
ABN , First Publish Date - 2020-12-10T15:13:15+05:30 IST
నగరంలోని పాతబస్తీలో దారుణం వెలుగుచూసింది. దుబాయ్‌లో మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బ్రోకర్లు మోసానికి పాల్పడ్డారు.

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం వెలుగుచూసింది. దుబాయ్‌లో మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బ్రోకర్లు మోసానికి పాల్పడ్డారు. ఒక్కో మహిళను రూ.2 లక్షలకు దుబాయ్ షేక్‌లకు అమ్మేశారు. విజిటింగ్ వీసాలపై పంపి ఐదుగురు మహిళలను బ్రోకర్లు విక్రయించారు. తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితుల బంధువులు ఈ వ్యవహారంపై విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.