ఈసీ నిర్లక్ష్యం...కంకి కొడవలి స్థానంలో సుత్తికొడవలి

ABN , First Publish Date - 2020-12-01T16:13:58+05:30 IST

ఓల్డ్ మలక్‌పేటలో ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం బయటపడింది.

ఈసీ నిర్లక్ష్యం...కంకి కొడవలి స్థానంలో సుత్తికొడవలి

హైదరాబాద్: ఓల్డ్ మలక్‌పేటలో ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం బయటపడింది. ఓల్డ్ మలక్ పేట్‌లో కంకి కొడవలి గుర్తుకు బదులుగా సుత్తి కొడవలిని ముద్రించారు. దీనిపై సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఓల్డ్ మలక్‌పేట్‌లో ఎన్నికలు నిలిపివేయాలని చాడ డిమాండ్ చేశారు. మరోవైపు గ్రేటర్‌లో ఎన్నికలు మందకొడిగా సాగుతున్నారు. ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Updated Date - 2020-12-01T16:13:58+05:30 IST